ఎన్టీఆర్‌-ప్రశాంత్‌ నీల్‌ మూవీకి 9న ముహూర్తం

ఎన్టీఆర్‌-ప్రశాంత్‌ నీల్‌ మూవీకి 9న ముహూర్తం

4 months ago | 39 Views

జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ 'దేవర'తో ఫుల్‌ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదల చేసిన చుట్టమ్లలె సాంగ్‌ నెట్టింటిని షేక్‌ చేస్తోంది. సెప్టెంబర్‌ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇదిలా ఉంటే తారక్‌ మరోవైపు ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌ 31 కు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చాలా రోజుల తర్వాత తాజాగా ఈ భారీ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట వైరల్‌ అవుతూ అభిమానులను ఖుషీ చేస్తోంది.


తారక్‌ ఎన్టీఆర్‌ 31 సినిమా లాంచింగ్‌కు ముహూర్తం ఖరారైంది. ఈ మూవీని ఆగస్టు 9న ఘనంగా ప్రారంభించేందుకు రెడీ అయ్యారు మేకర్స్‌. ప్రశాంత్‌ నీల్‌ ప్రాజెక్ట్‌కు డ్రాగన్‌ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు ఇప్పటికే ఆన్‌లైన్‌లో వార్తలు హల్‌ చల్‌ చేస్తున్నాయి. ఇక ప్రశాంత్‌ నీల్‌ సలార్‌తో బాక్సాఫీస్‌ను షేక్‌ చేశాడని తెలిసిందే. ప్రస్తుతానికి ఈ ప్రాంచైజీ ప్రాజెక్ట్‌ సీక్వెల్‌ సలార్‌ 2పై ఫోకస్‌ పెట్టాడని ఇన్‌సైడ్‌ టాక్‌ నడుస్తోంది. తారక్‌ కూడా దేవర, వార్‌ 2 సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్‌పై క్లారిటీ వచ్చిన తర్వాత ఎన్టీఆర్‌ 31 రెగ్యులర్‌ షూటింగ్‌ షెడ్యూల్‌ పై స్పష్టత రానుందని తెలుస్తోంది.

ఇంకా చదవండి: బాలకృష్ణ సరసన ముగ్గరు హీరోయిన్లు!?

# NTR 31     # JrNTR     # PrashanthNeel     # August9    

trending

View More