‘ఆర్‌సీ16’లో మున్నా భయ్యా
1 month ago | 5 Views
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటీకే ప్రమోషన్స్ మొదలుపెట్టారు మేకర్స్. ఇటీవల లక్నోలో ఈ చిత్రం టీజర్ విడుదల వేడుకలో ఆయన పాల్గొన్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని ప్రమోషన్స్ టూర్స్‌ను ప్లాన్ చేశారు మేకర్స్. శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. దిల్ రాజు నిర్మాత. ఇక ఈ సినిమా విడుదలకు ముందే రామ్‌చరణ్ తన తదుపరి చిత్రం చిత్రీకరణ షూటింగ్‌లో పాల్గొన్నాడు. ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న తాజా చిత్రం చిత్రీకరణ మైసూర్‌లోమొదలైంది. ఈ తొలిషెడ్యూల్‌లో హీరో రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీకపూర్‌తో పాటు చిత్రంలో ఇతర ముఖ్య పాత్రదారులు పాల్గొంటున్నారు. కొంత టాకీతో పాటు ఓ యాక్షన్ సన్నివేశాన్ని కూడా ఇక్కడ షూట్ చేస్తారని సమాచారం. రత్నవేలు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ సంగీత దర్శకుడు ఏఆర్. రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. వృధ్ధి సినిమాస్ పతాకంపై కిలారు సతీష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర ఎంతో వైవిధ్యంగా, మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుందట.
ముఖ్యంగా దర్శకుడు బుచ్చిబాబు చరణ్ పాత్రను డిజైన్ చేసిన విధానం గొప్పగా ఉంటుందని ఫిలిం నగర్ టాక్. అయితే ఈ సినిమాలో మీర్జాపూర్ వెబ్ సిరీస్ నటుడు దివ్యేండు శర్మ కీలక పాత్రల్లో నటించబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలను నిజం చేస్తూ.. దర్శకుడు బుచ్చిబాబు సనా ‘ఆర్‌సీ16’లో మున్నా భయ్యా నటించబోతున్నాడు అంటూ ప్రకటించాడు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. మీర్జాపూర్ వెబ్ సిరీస్‌లో మున్నా భయ్య పాత్రల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దివ్యేండు. దీంతో ‘ఆర్‌సీ16’ సినిమాకు అతడు ప్లస్ అవుతాడని చిత్రబృందం భావించినట్లు ఉంది.
ఇంకా చదవండి: నాన్న చిన్నప్పుడు అలా అనేవారు.. : సమంత
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# గేమ్ ఛేంజర్ # రామ్ చరణ్ # కియారా అడ్వాణీ