అడివిశేష్‌తో మృణాల్ ఠాకూర్ సినిమా.. 'డెకాయిట్' మూవీ ఫస్ట్ లుక్ వైరల్
6 hours ago | 5 Views
టాలీవుడ్ హీరో అడివిశేష్ కాంపౌండ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్‌లో ఉన్నాయని తెలిసిందే. వీటిలో ఒకటి డెకాయిట్ . షనీల్ డియో కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. అంతా అనుకున్నట్టుగా ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్‌ను ఫీ మేల్ లీడ్ రోల్‌లో ఫైనల్ చేశారు. చాలా రోజుల తర్వాత సస్పెన్స్‌కు తెరదించుతూ కొత్త లుక్ విడుదల చేశారు. డెకాయిట్ టీం కొత్త పోస్టర్‌లో మృణాల్ ఠాకూర్ ఓ చేత్తో స్టీరింగ్ తిప్పుతూ.. మరోచేతిలో పిస్తోల్ పట్టుకొని కనిపిస్తుంది.
పక్కనే అడివి శేష్ సిగరెట్ వెలిగిస్తున్నాడు. అవును వదిలేసాను.. కానీ మనస్పూర్తిగా ప్రేమించాను.. అడివిశేష్‌కు బర్త్ డే విషెస్ తెలియజేసింది మృణాల్ ఠాకూర్. డెకాయిట్‌లో హీరోహీరోయిన్లిద్దరూ ఏదో మిషన్‌లో పాల్గొంటున్నట్టుగా ఉన్న తాజా పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీతోపాటు అంచనాలు అమాంతం పెంచేస్తుంది. ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్, కల్కి 2898 ఏడీ చిత్రాల్లో మెరిసిన మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం నాలుగు హిందీ సినిమాల్లో నటిస్తోంది. అడివి శేష్ మరోవైపు వినయ్ కుమార్ దర్శకత్వం ‘గూఢచారి’ సీక్వెల్ ‘జీ2’లో కూడా నటిస్తున్నాడు. ఈ మూవీ పోస్టర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
ఇంకా చదవండి: ఏడాదికో సినిమా చేయాలనుకుంటున్నా \ : అమీర్‌ఖాన్
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# అడివిశేష్ # మృణాల్ ఠాకూర్