బోనాల కానుకగా 'మిస్టర్ బచ్చన్' టీజర్ విడుదల
4 months ago | 72 Views
మాస్ మహరాజా రవితేజ, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం 'మిస్టర్ బచ్చన్’. 'నామ్ తో సునా హోగా’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. పీపుల్ విూడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి షో రీల్‌తో పాటు పాటలు విడుదల చేయగా ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాను ఇండిపెండెన్స్ కానుకగా ఆగష్టు 15న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే.విడుదలకు కొద్ది రోజులే ఉండడంతో ప్రమోషన్స్ వేగం పెంచింది. ఇందులో భాగంగా ఈ మూవీ నుంచి టీజర్ అప్‌డేట్‌ను ప్రకటించింది చిత్రయూనిట్.
ఈ మూవీ టీజర్‌ను బోనాల పండుగ కానుకగా ఆదివారం విడుదల చేయనున్నట్లు తెలిపింది. మిరపకాయ్ సినిమా తర్వాత రవితేజ, హరీశ్ శంకర్ కాంబోలో ఈ సినిమా వస్తుండడంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. రవితేజ ఈ చిత్రంలో అమితాబ్‌బచ్చన్ అభిమానిగా కనిపించనున్నాడు. ఈ చిత్రంలో రవితేజ ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు.
ఇంకా చదవండి: బ్లడీ ఇష్క్ ..సాగతీత సినిమా
# MrBachchan # RaviTeja # HariShankar # August15