'మిస్టర్ బచ్చన్' టీజర్‌పై ..పెదవి విరుపులు!
4 months ago | 45 Views
దర్శకుడు హరీష్ శంకర్, రవితేజ కాంబినేషన్ లో వస్తున్న 'మిస్టర్ బచ్చన్' టీజర్ విడుదలైంది. పీపుల్స్ విూడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తోంది. టీజర్ ఫంక్షన్ కి రవితేజ వస్తాడు అనుకున్నారు, కానీ అతను రాలేదు. మామూలుగానే దర్శకుడు హరీష్ శంకర్ తన మాటలతో, సామాజిక మాధ్యమాల్లో వివాదాలతో ఉంటూ వస్తూ ఉంటాడు. అందుకేనేమో టీజర్ కన్నా, అతను విూడియా వాళ్ళతో మాట్లాడిన మాటలే ఎక్కువ వైరల్ అయినట్టుగా కనపడుతోంది.అందుకే 'మిస్టర్ బచ్చన్' టీజర్ కూడా అంత గొప్పగా లేకపోవటంతో, టీజర్ ని ఎవరూ పట్టించుకోలేదు. హరీష్ శంకర్ వ్యాఖ్యలు, వివాదాల మాటలే ఎక్కువగా అందరినీ ఆకర్షించాయని అనుకుంటున్నారు.
ఈ 'మిస్టర్ బచ్చన్' సినిమా ఇంతకు ముందు అజయ్ దేవగన్ నటించిన 'ది రైడ్’ సినిమాకి అనువాదంగా చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఎక్కువగా ప్యాకేజీలో హరీష్ శంకర్ తీశాడని పరిశ్రమలో వినిపిస్తున్న మాట. అందుకనే ఈ సినిమాపై అంతగా ఆశలు పెట్టుకొనవసరం లేదు అని కూడా అంటున్నారు. టీజర్ ఫంక్షన్ కి రవితేజ రాకపోవటంతో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. రవి తేజకి ఈ సినిమా ఫలితం ముందే తెలుసు, అందుకే రాలేదు అని, లేదు అతనికి ప్రొడక్షన్ హౌస్ కి మధ్య ఇంకా కొన్ని విషయాలు తేలలేదు అందుకని రాలేదు, అని అక్కడికి వచ్చిన వాళ్ళు మాట్లాడుకోవటం కనిపించింది. రవితేజ రాకపోవటంతో వచ్చిన అభిమానులు చాలా నిరాశ పడ్డారు. టీజర్ లో సినిమా గురించి ఇంకా కొంచెం రివీల్ చేస్తే బాగుండేది, హరీష్ శంకర్ టీజర్ లో విషయం చూపించలేకపోయారు అని కూడా అంటున్నారు.
ఇంకా చదవండి: తిరుమల కిషోర్ దర్శకత్వంలో రవితేజ!
# MrBachchan # RaviTeja # BhagyashriBorse