'కన్నప్ప' నుంచి  మోహన్‌లాల్‌ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌..

'కన్నప్ప' నుంచి మోహన్‌లాల్‌ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌..

13 hours ago | 5 Views

ఒకవైపు ఫ్యామిలీ గొడవలతో సతమవుతున్న మంచు ఫ్యామిలీ.. మరోవైపు తమ కలల ప్రాజెక్ట్‌ 'కన్నప్ప'ను పూర్తి చేసే పనిలో పడింది. మంచు కుటుంబం నుంచి వస్తున్న మోస్ట్‌ ప్రెస్టీజియస్‌ ప్రాజెక్ట్‌ 'కన్నప్ప'. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాను కలెక్షన్‌ కింగ్‌ మంచు మోహన్‌ బాబు నిర్మిస్తుండగా.. మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్నాడు. హిస్టారికల్‌ కం మైథాలాజీ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్‌, కోలీవుడ్‌ అగ్ర తారలు నటిస్తున్న విషయం తెలిసిందే.


ఈ చిత్రానికి మహాభారతం సీరియల్‌ ఫేమ్‌ ముఖేష్‌కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి మంచు మోహన్‌ బాబు, మంచు విష్ణులతో పాటు ప్రముఖుల ఫస్ట్‌ లుక్‌లను పంచుకున్న చిత్రబృందం తాజాగా మళయాలం స్టార్‌ నటుడు మోహన్‌ లాల్‌ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో లాలెట్టన్‌ (మోహన్‌ లాల్‌) కిరాట అనే పవర్‌ఫుల్‌ రోల్‌లో కనిపించబోతున్నట్లు చిత్రబృందం తెలిపింది.

ఇంకా చదవండి: సల్మాన్‌ అభిమానులను గుడ్‌న్యూస్‌.. 27న 'సికిందర్‌' టీజర్‌ రిలీజ్‌!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# కన్నప్ప     # మోహన్‌బాబు     # అరియానా     # వివియానా    

trending

View More