మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పాన్ ఇండియా మూవీ 'మట్కా' వింటేజ్ బ్రాండ్ న్యూ పోస్టర్ రిలీజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పాన్ ఇండియా మూవీ 'మట్కా' వింటేజ్ బ్రాండ్ న్యూ పోస్టర్ రిలీజ్

2 months ago | 5 Views

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్  మూవీ 'మట్కా' రిలీజ్ కు రెడీగా వుంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్,  SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు కూడా జోరందుకున్నాయి. ఫస్ట్ సింగిల్ లే లే రాజా చార్ట్ బస్టర్ రెస్పాన్స్ తో మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. నవంబర్ 14న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.


తాజాగా మేకర్స్ 'మట్కా' 25 డేస్ కౌంట్ డౌన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. వరుణ్ తేజ్ బ్లాక్ అండ్ బ్లాక్ సూట్ లో ఇంటెన్స్ అండ్ వింటేజ్ అవతార్ లో కనిపించిన ఈ పోస్టర్ అదిరిపోయింది. ప్రస్తుతం పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  మట్కా వరుణ్ తేజ్ మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ మూవీ. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం జివి ప్రకాష్ కుమార్ అందించగా, ఎ కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్. తారాగణం: వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి, నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్, తదితరులు. 

సాంకేతిక సిబ్బంది:

కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కరుణ కుమార్

నిర్మాతలు: డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి

బ్యానర్లు: వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్

సంగీతం: జివి ప్రకాష్ కుమార్

డీవోపీ: ఎ కిషోర్ కుమార్

ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్

సీఈఓ: ఈవీవీ సతీష్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆర్కే జానా, ప్రశాంత్ మండవ, సాగర్

కాస్ట్యూమ్స్: కిలారి లక్ష్మి

పీఆర్వో: వంశీ-శేఖర్

మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

ఇంకా చదవండి: 'వీక్షణం' ఈ రేంజ్ సక్సెస్ చూసి సంతోషంగా ఉంది : మూవీ థ్యాంక్స్ మీట్ లో డైరెక్టర్ మనోజ్ పల్లేటి

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# Matka     # VarunTej     # NoraFatehi     # MeenakshiChowdary    

trending

View More