ఓటీటీలోకి 'మట్కా'

ఓటీటీలోకి 'మట్కా'

1 month ago | 5 Views

విడుదలై నెల కూడా కాకుండానే ఓటీటీలోకి రాబోతుంది వరుణ్‌ తేజ్‌ మట్కా మూవీ. వరుణ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ డిజాస్టార్‌గా నిలిచిన ఈ సినిమా తాజాగా ఓటీటీ అనౌన్స్‌మెంట్‌ను పంచుకుంది. మెగా హీరో వరుణ్‌ తేజ్‌కి ఈ మధ్య అసలు కలిసి రావాట్లేదన్న విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో ఫిదా, తొలిప్రేమ సినిమాలతో సాలిడ్‌ హిట్లు అందుకున్న ఈ కుర్ర హీరో కెరీర్‌ గ్రాఫ్‌ సడన్‌గా పడిపోయింది. ఆపరేషన్‌ వాలంటైన్‌, గాండీవ ధారి అర్జున, గని సినిమాలతో వరుస డిజాస్టార్‌లను అందుకున్నాడు. ఇప్పుడు మట్కా సినిమాతో తాజాగా మరో డిజాస్టార్‌ను ఖాతాలో వేసుకున్నాడు.


ఈ సినిమా ఎంతటి పరజయం అందుకుంది అంటూ కనీసం పెట్టిన బడ్జెట్‌ కూడా రాకపోవడం విశేషం. ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం ఓటీటీ లాక్‌ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ సినిమా డిసెంబర్‌ 05 నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు వెల్లడించింది. పలాస 1978 సినిమాతో హిట్‌ అందుకున్న కరుణ కుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. విజేందర్‌ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి ఈ సినిమాను నిర్మించారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది.

ఇంకా చదవండి: 'పుష్ప' టికెట్‌ రేట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# మట్కా     # వరుణ్ తేజ్     # నోరా ఫతేహి     # మీనాక్షి చౌదరి    

trending

View More