మాస్ కా దాస్ విశ్వక్ సేన్  #VS13 అనౌన్స్‌మెంట్, ప్రీ-లుక్ రిలీజ్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ #VS13 అనౌన్స్‌మెంట్, ప్రీ-లుక్ రిలీజ్

1 month ago | 20 Views

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన 13వ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. దసరాతో భారీ బ్లాక్‌బస్టర్ అందించిన SLV సినిమాస్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బ్యానర్ నుంచి ప్రొడక్షన్ నెం. 8గా వస్తున్న ఈ చిత్రం గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో హై బడ్జెట్‌తో రూపొందనుంది. 

నూతన దర్శకుడు శ్రీధర్ గంటా రచన, దర్శకత్వం వహిస్తున్న #VS13 విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యూనిక్ పొలిటికల్ యాక్షన్ డ్రామా. విశ్వక్ పవర్ ఫుల్ ఐపిఎస్ ఆఫీసర్ గా ప్రీ-లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఫైర్ బ్యాక్ డ్రాప్ లో ప్రజెంట్ చేసిన ఈ పోస్టర్ సినిమాపై క్యురియాసిటీని క్రియేట్ చేసింది. 

ఎవ్రీ యాక్షన్ ఫైర్స్ ఎ రియాక్షన్ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్‌. #VS13లో టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. తంగలాన్ ఫేమ్ కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీని నిర్వహించనుండగా, కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూర్చనున్నారు.

ఈ హైలీ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ గురించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు. 

తారాగణం: విశ్వక్ సేన్

సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: శ్రీధర్ గంటా

నిర్మాత: సుధాకర్ చెరుకూరి

బ్యానర్: SLV సినిమాస్

డీవోపీ: కిషోర్ కుమార్

సంగీతం: అజనీష్ లోక్‌నాథ్

పీఆర్వో: వంశీ-శేఖర్

మార్కెటింగ్: ఫస్ట్ షో

ఇంకా చదవండి: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అద్భుత సినీ ప్రయాణానికి అద్దం పడుతున్న నెట్ ఫ్లిక్స్ "మోడరన్ మాస్టర్స్"

# VS13     # VishwakSen     # Tollywood    

trending

View More