కొత్త అనుభూతిని కలిగించే మారుతీనగర్ సుబ్రహ్మణ్యం!
3 months ago | 47 Views
(చిత్రం : మారుతీనగర్ సుబ్రహ్మణ్యం, నటీనటులు: రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్ తదితరులు. సాహిత్యం: చంద్రబోస్, భాస్కరభట్ల, కళ్యాణ్ చక్రవర్తి, ఆర్ట్ డైరెక్షన్: సురేష్ భీమంగని, ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి, పీఆర్వో: పులగం చిన్నారాయణ, సినిమాటోగ్రఫీ: ఎంఎన్ బాల్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: శ్రీహరి ఉదయగిరి, క్రియేటివ్ హెడ్: గోపాల్ అడుసుమిల్లి, సహ నిర్మాతలు: రుషి మర్ల, శివప్రసాద్ మర్ల, సమర్పణ: తబితా సుకుమార్, నిర్మాతలు: బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య, కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: లక్ష్మణ్ కార్య)
తెలుగు చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, కమెడియన్‌గా తనదైన శైలిలో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రను వేసుకొన్నారు విలక్షణ నటుడు రావు రమేష్. రావు రమేష్ ఎలాంటి పాత్రనైనా అవలీలగా తన మార్క్ నటనతో మెప్పించడమనేది తెలిసిందే. అతడు తాజాగా సరికొత్త పాత్రలో 'మారుతీ నగర్ సుబ్రమణ్యం' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ బ్యానర్లపై సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ సమర్పణలో బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రావు రమేష్ సరసన ఇంద్రజ, అంకిత్ కోయా, రమ్య పసుపులేటి, హర్షవర్గన్ నటించారు.
విశ్లేషణ : రావు రమేష్, శివన్నారాయణపై ఓపెన్ కాగా.. పొద్దున్నే పూజ మొదలు పెట్టావా? అగరబత్తి పొగలు కక్కుతోంది' అని శివన్నారాయణ అడిగితే... గోల్డ్ ఫ్లాక్ కింగ్ అని కొత్త బ్రాండ్ అగరబత్తి. నీ కూతురు వాడుతుంటే చూసి కొన్నాను అని రావు రమేష్ సైటైర్‌తో సమాధానం ఇస్తాడు. ఆ తర్వాత భార్య ఇంద్రజ సిగరెట్ ప్యాకెట్లన్నింటిని దొరకపట్టుకొని.. ఇక నుంచి నీకు సిగరెట్ల ఖర్చకు డబ్బులు ఇవ్వను అంటుంది.. దాంతో ఆ పక్కనే ఉన్న అన్నపూర్ణమ్మ.. నీకు అదృష్టం ఆవకాయంత ఉంటే.. దురదృష్టం ఆకాశమంత ఉందిరా బాబు అంటుంది. ఇక అంకిత్ కోయా, రమ్య పసుపులేటి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు యూత్‌కు గిలిగింతలు పెట్టేలా ఉన్నాయి. తన ప్రేయసిని మెప్పించడానికి మా నాన్న అల్లు అరవింద్ అంటూ అబద్దాలు చెప్పడమనేది ఆసక్తికరంగా కనిపించింది. ఇక తండ్రి రావు రమేష్‌తో కొడుకు అంకిత్.. డీఎన్ఏ టెస్ట్ చేయించు అంటే.. ఈడ్చి కొడితే ఈఎన్‌టీ టెస్ట్‌కు వెళ్తావు అనేది ఈ సినిమాలో డైలాగ్స్ ఎలా ఉంటాయో చెప్పకనే చెప్పాయి. ఆ సూపర్ స్టార్ అంటే అంత పిచ్చా? ఏకంగా ఇంటికే నిప్పు పెట్టేసిన రవితేజ.. ఈ విషయం తెలుసా? రమ్య తన ప్రియుడితో మాట్లాడుతూ.. మా మమ్మీ అయితే స్క్రిన్ ఆఫ్ రా కొట్టేస్తుందంటూ చెప్పే డైలాగ్ సినిమాలో కామెడీకి భారీగా పెద్ద పీట వేశారనే విషయం స్పష్టం చేశారు. తండ్రి అప్పుల్లో కూరుకుపోవడం.. డబ్బు కోసం తండ్రి కొడుకులు వేసిన డ్రామాలు కేకపెట్టించాయి. ఫన్, కామెడీ, ఎమోషన్స్, నటీనటులు హై రేంజ్ ఫెర్ఫార్మెన్స్‌ను రుచి చూపించిన ఈ సినిమాలో తనదైన శైలిలో డైలాగ్స్‌తో ఆకట్టుకొనే రావు రమేష్ ఈ చిత్రంలో డైలాగ్ డెలివరీతో చెలరేగిపోయాడు. ఈ తండ్రి కొడుకుల మ్యాజికల్ సైటిరిక్ డ్రామాను ఆగస్టు 23వ తేదీన చూడాల్సిందే. మారుతి నగర్ సుబ్రమణ్యం కొత్త అనుభూతిని కలిగిస్తుందనే ఫీలింగ్ మాత్రం క్రియేట్ చేసిందనే చెప్పాలి.
ఇంకా చదవండి: '35' చిన్న కథ కాదు.. గ్లింప్స్ వచ్చేసింది!
# Maruthinagarsubramanyam # Raoramesh # Lakshmankarya # August23