నవ్వులు పూయించిన 'మారుతీనగర్ సుబ్రమణ్యం'
2 months ago | 27 Views
రావు రమేష్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం 'మారుతీ నగర్ సుబ్రమణ్యం’లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. ట్రైలర్, టీజర్‌తో ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌తో మంచి అంచనాలు తెచ్చుకున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే అనేక ప్రాంతాలలో సినిమా షోలు స్టార్ట్ అవగా చాలామంది ఈ మూవీని చూసి తమ అభిప్రాయాలు తెలుపుతున్నారు. మధ్య తరగతి నిరుద్యోగికి అనుకోకుండా 10 లక్షలు లభిస్తే ఏం చేశాడనే కథతో రూపొందిన ఈ చిత్రం ఆద్యంతం నవ్వులు పూయించిందని, పెట్టిన డబ్బుకు సరిపోను ఎంటర్‌టైన్ మెంట్ ఇచ్చారని చాలామంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ రెఫరెన్సులు వాడిన విధానం సినిమాకే హైలెట్‌గా ఉందని, ఒకటి రెండు సందర్భాల్లో చిరంజీవి పాటలకు రావు రమేశ్ తన డ్యాన్స్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేశాడని కామొంట్లు పెడుతున్నారు.
అదేవిధంగా పాటలు, బావున్నాయని, ఫస్టాప్ వరకు ఓ రీతిలో ఉన్న రావు రామేశ్ పాత్ర డబ్బులు వచ్చాక సెకండాఫ్‌లో మారిన విధానం బావుందని అంటున్నారు. సినిమాలో అక్కడక్కడ లాజిక్‌లు మిస్సయిన నవ్వులకు ఎలాంటి ఢోకాలేదని, ఈ ఏడాది బెస్ట్ కామెడీ చిత్రం ఇదేనని, చాలా రోజుల తర్వాత మంచి వినోదం ఇచ్చారని పోస్టులు పెడుతున్నారు. అంతేగాక రావు రమేశ్ చేసిన డ్యాన్స్ క్లిప్పులను సోషల్ విూడియాలో షేర్ చేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.
సినిమా అంతటినీ రావు రమేశ్ తన భుజాలపై మోస్తూ ఓ రేంజ్‌కు తీసుకెళ్లడాని, భార్యగా చేసిన ఇంద్రజ, కోడుకుగా చేసిన అంకిత్, రమ్య క్యారెక్టర్లు కూడా బాగా పండాయని చెబుతున్నారు. ముఖ్యంగా.. నా తండ్రి అల్లు అరవింద్, నా అన్నయ్య అల్లు అర్జున్ అంటూ రావు రమేశ్ కొడుకు క్యారెక్టర్ పదే పదే చెబుతూ , సినిమాలో తను ప్రేమించిన అమ్మాయిని ఊహించుకుంటూ పాడుకునే పాటల్లోనూ అల్లు అర్జున్ సూపర్ హిట్ సాంగ్స్ రీ క్రియేషన్ చేసిని విధానం చాలా హైలెట్‌గా ఉందని అంటున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిందే అంటూ తమ తమ పోస్టులలో రాసుకొస్తున్నారు. వినోదంతో పాటు చక్కటి కుటుంబ విలువలతో తెరకెక్కిన ఈ ’మారుతీ నగర్ సుబ్రమణ్యం’ సినిమాను మిస్ చేయవద్దని కోరుతున్నారు.
ఇంకా చదవండి: రికార్డుల మోత మోగిస్తున్న క్రైమ్ థ్రిల్లర్..!
# MaruthiNagarSubramanyam # RaoRamesh