ఓటిటిలోకి వచ్చేసిన 'మారుతీనగర్‌ సుబ్రమణ్యం'

ఓటిటిలోకి వచ్చేసిన 'మారుతీనగర్‌ సుబ్రమణ్యం'

2 months ago | 26 Views

రావు రమేశ్‌ ప్రధాన పాత్రలో రూపొందిన 'మారుతీనగర్‌ సుబ్రమణ్యం’ సినిమా నెల రోజుల్లోపే డిజిటల్‌ స్ట్రీమింగ్ కు  వచ్చేసింది. ఇంద్రజ , అంకిత్‌ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్థన్‌, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్‌, అజయ్‌ ఇతర పాత్రల్లో నటించగా లక్షణ్‌ కార్య దర్శకత్వం వహించాడు. ప్రముఖ క్రియేటివ్‌ దర్శకుడు సుకుమార్‌ భార్య తబిత ఈ చిత్రానికి సమర్పకురాలిగా వ్యవహరించింది. ఆగస్టు 23న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ అద్భుతమైన టాక్‌తో మంచి విజయం సాధించింది. కథ విషయానికి వస్తే.. మారుతీనగర్‌లో నివసించే ఓ నిరుద్యోగి సుబ్రమణ్యం (రావు రమేష్‌). చాలా ప్రభుత్వాలకు ప్రయత్నించినా ఏది రాదు.

చివరకు టీచర్‌ జాబ్‌ వచ్చినప్పటికీ అది కాస్త కోర్టులో ఉండడంతో 25 సంవత్సరాలు ఏ పనీ లేకుండా భార్య కళారాణి (ఇంద్రజ) జీతం విూద ఆధార పడుతుంటాడు. అలాంటిది సడన్‌గా ఓ రోజు అనుకోకుండా సుబ్రమణ్యం అకౌంట్‌లో రూ.10 లక్షల డబ్బు జమ కావడంతో ఎగిరి గంతేస్తారు. తొందరలో తమ జల్సాల కోసం తండ్రీ కొడుకులిద్దరు ఆ డబ్బును ఖర్చు చేస్తారు. ఈ క్రమంలో అసలు విషయం తెలిసి ఏం చేశారు, ఇంతకీ ఆ డబ్బు ఎవరిది? వారి అకౌంట్‌లో ఎందుకు పడింది.. అర్జున్‌, కాంచనల ప్రేమ విజయవంతం అయిందా ? సుబ్రమణ్యం ప్రభుత్వ ఉద్యోగం పరిస్థితి ఏమైందన్నదే కథ.

ఇంకా చదవండి: అశోక్ గల్లా హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# MaruthiNagarSubramanyam     # RaoRamesh     # RamyaPasupileti    

trending

View More