'కన్నప్ప' నుంచి మారెమ్మ పోస్టర్ విడుదల!
2 months ago | 37 Views
మంచు ఫ్యామిలీ అభిమానులు ఎదురుచూస్తున్నరోజు రానే వచ్చింది. 'కన్నప్ప' చిత్రం నుంచి మరో నూతన అప్డేట్ వచ్చింది. ఇప్పటికే గడిచిన రెండు నెలలుగా ప్రతి సోమవారం కన్నప్ప సినిమాలో నటించిన నటీనటులను రివీల్ చేస్తూ వాళ్ల పాత్రలను పరిచయం చేస్తు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే అక్షయ్ కుమార్, శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా, టిక్కి పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లు రిలీజ్ చేశారు. తాజాగా ఈ 'కన్నప్ప' సినిమాలో నటిస్తున్న మరో సీనియర్ నటి ఐశ్వర్య ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.
అంతేకాదు ఆమె నటించిన మారెమ్మ పాత్రను, చేసే పనిని రివీల్ చేశారు. అడవిని పీడించే అరాచకం.. మారెమ్మ.. కుతంత్రమే తన మంత్రం అంటూ ట్యాగ్ లైన్ తగిలించారు. ఈ లుక్‌లో ఐశ్వర్య చాలా భయంకరంగా, క్రూరంగా ఉంది. ఇప్పుడు ఈ పోస్టర్ సోషల్ విూడియాలో బాగా వైరల్ అవుతోంది. మంచు విష్ణు కలల సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మహా భారతం సీరియల్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా డిసెంబర్‌లో ఈ సినిమా పాన్ ఇండియా వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇంకా చదవండి: 'హరిహరవీరమల్లు'పై కీలక అప్‌డేట్... మార్చి 28న విడుదల కానున్నట్లు ప్రకటన!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!