మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ బయోపిక్‌..  'అమరన్‌’లో శికార్తికేయన్‌, సాయిపల్లవి జంట!

మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ బయోపిక్‌.. 'అమరన్‌’లో శికార్తికేయన్‌, సాయిపల్లవి జంట!

1 month ago | 5 Views

శివ కార్తికేయన్‌, సాయిపల్లవి  జంటగా నటించిన చిత్రం 'అమరన్‌’ రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్‌ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో శివ కార్తికేయన్‌ ఆర్మీ అధికారి మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా చెన్నై వేదికగా దీని ఆడియో లాంచ్‌ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. పలువురు ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ కార్యక్రమంలో సాయిపల్లవిని శివకార్తికేయన్‌ ప్రశంసించారు.'మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ గురించి మొదట వార్తల్లో విన్నా. రాజ్‌ కుమార్‌ ఈ కథను వివరించినప్పుడు భావోద్వేగానికి గురయ్యా. ముకుంద్‌ గొప్ప లీడర్‌. కశ్మీర్‌లో 100రోజుల పాటు యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించాం. రాత్రిపూట కావడంతో చలి ఎక్కువగా ఉండేది.


ఈ చిత్రం క్లైమాక్స్‌ అందరినీ కంటతడి పెట్టిస్తుంది. ముకుంద్‌ అందమైన జీవితాన్ని, ఆయన కుటుంబాన్ని అందరూ గౌరవించేలా దీన్ని తీర్చిదిద్దాం. ఈ సినిమా కోసం ఆయన కుటుంబాన్ని సంప్రదించినప్పుడు తమిళ హీరోతోనే తీయాలని వాళ్లు కోరారు. ముకుంద్‌కు తమిళ పరిశ్రమ అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. నేను ఓ టీవీ ఛానల్‌లో వర్క్‌ చేస్తున్నప్పుడు సాయిపల్లవిని మొదటిసారి కలిశాను. నేను వ్యాఖ్యతగా వ్యవహరించిన ఓ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఇండస్ట్రీలో ఆమె పేరే ఒక బ్రాండ్‌. 'ప్రేమమ్‌’లో ఆమె నటన చూసి ఆశ్చర్యపోయా. ఫోన్‌ చేసి ప్రశంసించా. ఆమె వెంటనే 'థ్యాంక్యూ అన్నా’ అని చెప్పింది. నన్ను అన్నా అని పిలిచినందుకు అప్పుడు చాలా ఫీలయ్యాను. ఆమె గొప్ప నటి'' అని అన్నారు. ''ఈ సినిమా దేశమంతా గర్వపడుతుంది. ఇటీవల కమల్‌హాసన్‌ ఈ చిత్రం చూసి భావోద్వేగానికి గురయ్యారు. టిష్యూలు దగ్గర పెట్టుకొని దీన్ని చూశారు'' అని దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ అన్నారు. మణిరత్నం మాట్లాడుతూ..'ముకుంద్‌ లాంటి గొప్ప వ్యక్తుల గురించి అందరూ తెలుసుకోవాలి. నేను సాయి పల్లవికి పెద్ద అభిమానిని. భవిష్యత్తులో ఆమెతో కలిసి వర్క్‌ చేయాలని కోరుకుంటున్నా'' అని చెప్పారు. శివకార్తికేయన్‌ ఈ సినిమాకు సరైన ఎంపికని సాయి పల్లవి అన్నారు.

ఇంకా చదవండి: ప్రీ ఇండిపెండెన్స్‌ స్టోరీగా ఫౌజీ

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# Amaran     # Sivakarthikeyan     # SaiPallavi    

trending

View More