జనవరిలో సెట్స్‌పైకి మహేష్ బాబు సినిమా!

జనవరిలో సెట్స్‌పైకి మహేష్ బాబు సినిమా!

3 months ago | 5 Views

మహేష్ బాబు  కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఓ భారీ ప్రాజెక్ట్‌ తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఎస్‌ఎస్‌ఎంబి29  ఇది ప్రచారంలో ఉంది. భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మక స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమా గురించే సినీ ప్రియులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్‌ తాజాగా ఎస్‌ఎస్‌ఎంబి29 షూటింగ్‌ గురించి మాట్లాడారు. 'మాస్టర్‌ క్లాస్‌ బై మిస్టర్‌ విజయేంద్ర ప్రసాద్‌’ అనే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. జనవరి నుంచి మహేష్-రాజమౌళి మూవీ షూట్‌ ప్రారంభం కానుందని చెప్పారు. ఈ కథ రాయడానికి దాదాపు రెండేళ్లు టైమ్‌ పట్టిందన్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై సినీ ప్రియులు, ముఖ్యంగా మహేశ్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ దీనిని అనువదించ నున్నారు. దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్‌.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకూ చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఆవిష్కరించబోతున్నారని రచయిత విజయేందప్రసాద్‌ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మహేష్  బాబు విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి 'గరుడ’ అనే టైటిల్‌ ఫిక్స్‌ అవకాశం ఉందని ప్రచారం.

ఇంకా చదవండి: రజనీ 'వేట్టయాన్‌' మూవీ : సాదాసీదా కథతో పట్టు తప్పిన కథనం!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

trending

View More