మహేష్ బాబు పుట్టిన రోజు.. ఆగస్ట్ 9న మురారి రీ రిలీజ్‌కు న్నాహాలు!
5 months ago | 91 Views
మహేష్ బాబు పుట్టినరోజైన ఆగస్టు 9న అభిమానులు తమ అభిమాన నటుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుతూ ఉండటం ఆనవాయితీ. అయితే ఈ సంవత్సరం మహేష్ బాబు అభిమానులు రాజమౌళితో
సూపర్ స్టార్ చెయ్యబోయే సినిమా గురించి ఏదైనా సమాచారం ఆరోజు ఇస్తారేమో అని ఎదురు చూస్తున్నారు. కానీ అటువంటిదేవిూ ఉండకపోవచ్చు అని తెలుస్తోంది. ఎందుకంటే ఆ సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లోనే వున్నట్టుగా భోగట్టా, అందుకని ఆ సినిమా నుండి ఎటువంటి అప్డేట్ ఉండకపోవచ్చు అని అంటున్నారు.
అయితే ఆగస్టు 9 న మహేష్ అభిమానులు ఇంకో విధంగా సంబరాలు చేసుకోవచ్చు. 'మురారి’ సినిమాని ఆగస్టు 9న మళ్ళీ థియేటర్స్ విడుదల చేస్తున్నారు. మహేష్ బాబు కెరీర్ తొలినాళ్లలోనే దర్శకుడు కృష్ణ వంశీతో పనిచేసే అవకాశం దక్కింది. కృష్ణ వంశీ, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన 'మురారి’ సినిమా మహేష్ బాబు కెరీర్ లో ఒక కీలకమైన సినిమాగా చెప్పొచ్చు. ఇందులో మహేష్ బాబు నటన అత్యుత్తమంగా ఉంటుంది. ఈ సినిమా అప్పట్లో విజయవంతమైన సినిమా. నందిగం రామలింగేశ్వర రావు నిర్మాత. మహేష్ బాబు కథానాయకుడిగా నటించడం మొదలు పెట్టిన తరువాత 'మురారి’ అతనికి నాలుగో సినిమా. ఈ సినిమాలో పాటలు అన్నీ పెద్ద విజయం సాధించాయి. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే సినిమా కుటుంబ సమేతంగా చూసే సినిమా కూడాను. కృష్ణవంశీ అత్యద్భుతంగా తెరకెకెక్కించిన సినిమాలో 'మురారి’ ఒకటి. ఇందులో సోనాలి బింద్రే కథానాయికగా నటించింది. సత్యనారాయణ, ప్రసాద్ బాబు, శివాజీ రాజా, చిన్నా, అల్లరి రవి బాబు, గొల్లపూడి, రఘుబాబు లాంటి నటీనటులు చాలామంది వుంటారు. లక్ష్మి ఇందులో మహేష్ బాబు తల్లిగా ఒక ముఖ్యమైన పాత్రలో నటించగా, సుకుమారి అనే మలయాళం నటి మహేష్ బాబు నాయనమ్మగా ఇంకో ముఖ్యపాత్రలో కనపడతారు. అందరూ ఎంతో సహజసిద్ధంగా నటించి మెప్పించిన ఈ 'మురారి’ సినిమా ఆగస్టు 9న మహేష్ జన్మదిన సందర్భంగా మళ్ళీ థియేటర్స్ లో విడుదలవుతోంది. అభిమానులు ఈ సినిమాతో మహేష్ జన్మదిన వేడుకల్ని సంబరంగా జరుపుకోవచ్చు అని అనుకుంటున్నారు.
ఇంకా చదవండి: ఫిల్మ్ సిటీలో శరవేగంగా 'తండేల్' చిత్రీకరణ!
# Mahesh Babu # Birthday # August9