స్టార్ హీరో నిఖిల్ చేతుల మీదుగా లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ

స్టార్ హీరో నిఖిల్ చేతుల మీదుగా లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ "అనంతం" టీజర్ రిలీజ్

1 month ago | 5 Views

వెంకట్ శివకుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా "అనంతం". ఈ చిత్రంలో రుచిత సాధినేని, రామ్ కిషన్, స్నిగ్ధ నయని, వసంతిక మచ్చ, చైతన్య సగిరాజు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. "అనంతం" సినిమాను ఆరుద్ర ప్రొడక్షన్స్ సమర్పణలో విజయ లక్ష్మి, సుధీర్ నిర్మిస్తున్నారు. సాయిచరణ్ రెడ్డి రేకులతో కలిసి స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందించారు వెంకట శివకుమార్. లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న "అనంతం" సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో స్టార్ హీరో నిఖిల్ చేతుల మీదుగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. "అనంతం" సినిమా టీజర్ చాలా ఆసక్తికరంగా ఉండి ఆకట్టుకుందని చెప్పిన హీరో నిఖిల్, మూవీ టీమ్ కు తన బెస్ట్ విశెస్ అందించారు.


ఈ సందర్భంగా  నిర్మాతలు విజయలక్ష్మి, సుధీర్ మాట్లాడుతూ - మా అనంతం మూవీ టీజర్ రిలీజ్ చేసిన హీరో నిఖిల్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. ఆయన ఎంతో బిజీగా ఉన్నా మాకు టైమ్ ఇచ్చారు. లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా అనంతం సినిమాను నిర్మించాం. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో చాలా ఇంట్రెస్టింగ్ గా మూవీ ఉంటుంది. మూవీ పూర్తయ్యింది. త్వరలోనే మంచి తేదీ చూసి గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తాం. అన్నారు.

నటీనటులు - వెంకట్ శివకుమార్, రుచిత సాధినేని, రామ్ కిషన్, స్నిగ్ధ నయని, వసంతిక మచ్చ, చైతన్య సగిరాజు, తదితరులు 

టెక్నికల్ టీమ్

డీవోపీ - రాహుల్ కేజీ విఘ్నేష్, దీపక్ కుమార్

మ్యూజిక్ - స్నిగ్ధ నయని

ఎడిటర్ - పవన్ కల్యాణ్ కొదాటి

పీఆర్ఓ - వీరబాబు

ప్రొడ్యూసర్స్ - విజయలక్ష్మి, సుధీర్

స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ - సాయిచరణ్ రెడ్డి రేకుల, వెంకట శివకుమార్

డైరెక్టర్ - వెంకట శివకుమార్

ఇంకా చదవండి: సినిమాకి భాషా సరిహద్దులు ఉండవు.. ‘ఫౌజా’ ప్రత్యేక ప్రదర్శనలో హీరో కార్తీక్ ద‌మ్ము

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# అనంతం     # నిఖిల్    

trending

View More