
లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ పాత్రధారులుగా రాబోతున్న సరికొత్త చిత్రం ‘సతీ లీలావతి’
1 month ago | 5 Views
ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో.. వైవిధ్యమైన ప్రాతలతోకథానాయికగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి, మలయాళ నటుడు దేవ్ మోమన్ ప్రధాన పాత్రల్లో దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ పతాకాల సంయుక్త నిర్మాణ సారథ్యంలో ప్రొడక్షన్ నెం.1గా భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్(శివ మనసులో శృతి)తదితర విభిన్న చిత్రాల దర్శకుడు తాతినేని సత్య దర్శకత్వంలో నాగమోహన్ బాబు.ఎమ్, రాజేష్.టి నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’. సోమవారం ఉదయం ఈ సినిమా పూజా కార్యక్రమాలు రామోజీ ఫిల్మ్ సిటీలోని సంఘి హౌస్‌లో జరిగాయి. ఈ కార్యక్రమంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, చిత్ర సమర్పకులు జెమినీ కిరణ్, నిర్మాతలు హరీష్ పెద్ది, వి.ఆనంద ప్రసాద్, అన్నే రవి, డైరెక్టర్ తాతినేని సత్య తండ్రి, సీనియర్ డైరెక్టర్ టి.ఎల్.వి.ప్రసాద్ సహా పలువురు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు పాల్గొన్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత హరీష్ పెద్ది క్లాప్ కొట్టారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా,సీనియర్ డైరెక్టర్ టి.ఎల్.వి.ప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు తాతినేని సత్య ‘‘ఆహ్లాదాన్ని కలిగించే చక్కటి ఎంటర్‌టైనర్‌గా ‘సతీ లీలావతి’ రూపొందుతుంది. మనస్ఫూర్తిగా నవ్వుకునే రొమాంటిక్ డ్రామాగా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే అంశాలతో సినిమా తెరకెక్కుతుంది. లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ జోడీ ఫ్రెష్ లుక్‌తో మెప్పించనున్నారు. సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను కూడా ఈరోజు నుంచే ప్రారంభిస్తున్నాం’’ అన్నారు.
చిత్ర నిర్మాతలు నాగమోహన్ బాబు.ఎమ్, రాజేష్.టి మాట్లాడుతూ ‘‘మా జర్నీలో మాకు సపోర్ట్ చేస్తున్న ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ అధినేత కిరణ్‌గారికి ధన్యవాదాలు. అలాగే మా టీమ్‌కు అభినందించటానికి విచ్చేసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇతర సినీ ప్రముఖులకు స్పెషల్ థాంక్స్. మా డైరెక్టర్ తాతినేని సత్యగారు స్క్రిప్ట్ చెప్పగానే నేటి తరం ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే సినిమా అనిపించింది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే సినిమాగా దీన్ని రూపొందిస్తున్నాం. సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను కూడా ఈరోజు నుంచే ప్రారంభిస్తున్నాం. త్వరలోనే మరిన్ని వివరాలను తెలియజేస్తాం’’ అన్నారు.
నటీనటులు:
లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ తదితరులు
సాంకేతిక వర్గం:
సమర్పణ: ఆనంది ఆర్ట్ క్రియేషన్స్
బ్యానర్స్: దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్
నిర్మాతలు: నాగమోహన్ బాబు.ఎమ్, రాజేష్.టి
దర్శకత్వం: తాతినేని సత్య
సంగీతం: మిక్కీ జె.మేయర్
సినిమాటోగ్రఫీ: బినేంద్ర మీనన్
మాటలు: ఉదయ్ పొట్టిపాడు
ఆర్ట్: కోసనం విఠల్
ఎడిటర్: సతీష్ సూర్య
పి.ఆర్.ఒ: మోహన్ తుమ్మల
ఇంకా చదవండి: ఘనంగా హాస్య మూవీస్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.7, హీరో కిరణ్ అబ్బవరం ‘K-ర్యాంప్’ ప్రారంభం
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!