లల్లీ మధుమిత "హతవిధి" 'ది అఫెండర్' ఫస్ట్ లుక్ విడుదల!!
1 month ago | 5 Views
లల్లీ మధుమిత "షీరో" కమ్
ప్రొడ్యూసర్ గా... సుమన్,
భానుచందర్, ఆమని, సమీర్,
దేవీప్రసాద్ ముఖ్యపాత్రల్లో...!!
ఇషా క్రియేషన్స్ పతాకంపై లల్లీ మధుమిత నటించి నిర్మించిన చిత్రం "హతవిధి". 'అఫెండర్' అన్నది ట్యాగ్ లైన్. యువ ప్రతిభాశాలి రాహుల్ జి గౌలికర్ దర్శకత్వంలో విభిన్న కథ-కథనాలతో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. లల్లీ మధుమిత - హరినాథ్ షీరో-హీరోలుగా... సీనియర్ హీరోలు సుమన్, భానుచందర్, సీనియర్ హీరోయిన్ ఆమని, సమీర్, దేవీప్రసాద్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం ప్రచారానికి శ్రీకారం చుడుతూ... ఫస్ట్ లుక్ రిలీజ్ వేడుక నిర్వహించారు!!
లల్లీ మధుమిత అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ వేడుకలో ఇందులో నటించిన సుమన్, భానుచందర్, సమీర్, గూడ రామకృష్ణలతోపాటు... షీరో కమ్ ప్రొడ్యూసర్ లల్లీ మధుమిత, హీరో హరినాథ్, దర్శకుడు రాహుల్ జి గౌలికర్ పాలుపంచుకున్నారు!!
ప్రముఖ దర్శకనిర్మాత - నటుడు- స్థిరాస్తి వ్యాపారవేత్త లయన్ సాయి వెంకట్, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, తెలంగాణ బి.సి.కమీషన్ మాజీ చైర్మన్ వకులాభారణం కృష్ణమోహన్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొని... "హతవిధి" ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరించారు. "హతవిధి" ఫస్ట్ లుక్ దర్శకుడు రాహుల్ ప్రతిభకు అద్దం పడుతూ అసాధారణంగా ఉందని, లల్లీ మధుమితకు హీరోయిన్ గా మంచి పేరు, నిర్మాతగా రెట్టింపు లాభాలు రావాలని ఆకాంక్షించారు!!
షీరో కమ్ ప్రొడ్యూసర్ లల్లీ మధుమిత, దర్శకుడు రాహుల్ మాట్లాడుతూ... ఎన్నో వ్యయప్రయాసలకోర్చి రూపొందించిన "హతవిధి" ఫస్ట్ లుక్ మాదిరిగానే అద్భుతంగా వచ్చిందని, నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ప్రాణం పెట్టి పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న "హతవిధి" చిత్రం విడుదల తేది త్వరలో ప్రకటిస్తామని తెలిపారు!!
సత్య ప్రకాష్, గ్రీష్మ, శ్రీనివాస్ నాయుడు, కీర్తన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, సంగీతం: అజయ్ పట్నాయక్, నిర్మాత: లల్లి మధుమిత, కథ-స్క్రీన్ ప్లే-మాటలు- దర్శకత్వం: రాహుల్ జి గౌలికర్!!
ఇంకా చదవండి: కంటెంట్ ఉంటే సినిమాకి జనాలొస్తారు అంటున్న రాకేష్ వర్రే. 75 రూపీస్ కి ప్రీమియర్స్ తో నవంబర్ 8 న విడుదల కానున్న జితేందర్ రెడ్డి
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# హతవిధి ది అఫెండర్ # లల్లీ మధుమిత