రామాయణంలోకి అడుగు పెడుతున్న కునాల్
4 months ago | 45 Views
బాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ’రామాయణ’. నితేశ్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్ అగ్ర నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్ దీన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి వార్తలు సోషల్ విూడియాలో ఎన్నోసార్లు వైరల్ కాగా.. తాజాగా ఈ భారీ ప్రాజెక్ట్‌లో మరో నటుడు భాగం కానున్నారనే వార్త తెగ షేర్ అవుతోంది. బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ ’రామాయణ’లో కీలకపాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఆయనకు స్క్రీన్ టెస్ట్ కూడా నిర్వహించినట్లు బాలీవుడ్ విూడియాలో వార్తలు వస్తున్నాయి. తన పాత్ర కోసం రిహార్సిల్స్ చేస్తున్నారని టాక్. అయితే, ఈ పాత్రకు సంబంధించిన వివరాలను చిత్రబృందం గోప్యంగా ఉంచాలని భావిస్తోందట.
చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రానున్న ’విశ్వంభర’లోనూ కునాల్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆయన విలన్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ’రామాయణ’ విషయానికొస్తే.. చిత్రాన్ని రెండు భాగాలుగా తీయాలని మేకర్స్ భావిస్తున్నారు. 2025 డిసెంబర్ నాటికి షూటింగ్ పూర్తి చేయాలనుకుంటున్నారు. దీని కోసం పన్నెండు భారీ సెట్లను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయోధ్య, మిథిలా నగరాలను తలపించేలా వాటిని తీర్చి దిద్దుతోందట మూవీ యూనిట్. 3డీ ఫార్మాట్‌లో, భారీ వ్యయంతో ముంబయిలో వీటిని రూపొందిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దీని షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ చిత్రీకరణకు సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా సోషల్ విూడియాలో ఇటీవల సందడి చేశాయి.
ఇందులో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ , సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్, హనుమంతుడి పాత్రలో సన్నీ దేవోల్, కైకేయిగా లారాదత్తా, శూర్పణఖగా రకుల్‌ప్రీత్‌సింగ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక సమాచారం కోసం సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇంకా చదవండి: ఎక్సక్లూసివ్: ఆగస్టులో విడుదల కాబోయే తెలుగు చిత్రాలు
# Ramayana # RanbirKapoor # SaiPallavi # KunalKapoor