ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం 'క' సినిమా!
22 days ago | 5 Views
టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం రీసెంట్‌గా 'క' సినిమాతో ప్రేక్షకులను పలకరించాడని తెలిసిందే. 1970 ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణగిరి గ్రామం నేపథ్యంలో సాగే పీరియాడిక్ థ్రిల్లర్‌గా పాన్ ఇండియా కథాంశంతో వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీని థియేటర్లలో మిస్సయిన వారి కోసం డిజిటల్ ఎంట్రీ అప్‌డేట్ వచ్చేసింది. ప్రస్తుతం 'క' పాపులర్ ఓటీటీ ప్లాట్‌పాం ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు 'క' డాల్బీ విజన్‌లో సందడి చేస్తుండటం విశేషం.
ఈటీవీ విన్‌లో డాల్బీ విజన్‌లో స్ట్రీమింగ్ అవుతున్న తొలి సినిమాగా అరుదైన ఫీట్ నమోదు చేసింది 'క'. ఇంకేంటి మరి డాల్బీ విజన్‌లో మీరూ చూసేయండి. సుజిత్-సందీప్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో 2018 ఫేం తాన్వి రామ్, 'గం గం గణేశా' ఫేం నయన్ సారిక ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషించారు. వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కించిన ఈ మూవీకి శ్యామ్ సీఎస్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించాడు.
ఇంకా చదవండి: "ఇట్స్ ఓకే గురు" ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేసిన నిర్మాతల మండలి అధ్యక్షుడు కె.ఎల్. దామోదర్ ప్రసాద్
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# క # కిరణ్‌అబ్బవరం # ఓటీటీ