31న వస్తున్న కిరణ్ అబ్బవరం 'క...' మూవీ
2 months ago | 5 Views
కిరణ్ అబ్బవరం కాంపౌండ్ నుంచి వస్తోన్న తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ క . సుజిత్ సందీప్ డైరెక్ట్ చేస్తున్నారు. 1970స్ ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణగిరి గ్రామం బ్యాక్ డ్రాప్‌లో సాగే పీరియాడిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 31న దీపావళి కానుకగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్ లాంచ్ చేయనున్నారు మేకర్స్. మిస్టరీ, థ్రిల్లింగ్, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో క ప్రపంచంలో మిమ్మల్ని ముంచెత్తడానికి అంతా సిద్ధంగా ఉంది.. అంటూ ట్రైలర్‌ను అక్టోబర్ 24న లాంచ్ చేయనున్నట్టు ప్రకటించారు.
డార్క్ షేడ్స్‌లో ఎండిన చెట్ల మధ్యలో అనుమానాస్పద ఆకారం.. దానిపై గొడ్డలి లాంటి ఆయుధం నీడ కనిపిస్తున్న విజువల్స్ ట్రైలర్‌తోపాటు సినిమాపై సూపర్ క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. టైం ట్రావెల్ స్టోరీ చుట్టూ తిరిగే క చిత్రం నుంచి విడుదలైన రషెస్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రంలో 2018 ఫేం తాన్వి రామ్, గం గం గణేశా ఫేం నయన్ సారిక ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
ఇంకా చదవండి: పుట్టిన రోజు సందర్భంగా 'కాఫీ విత్ ఏ కిల్లర్' 'సోలో బాయ్' విడుదల గురించి అప్డేట్ ఇచ్చిన సెవెన్ హిల్స్ సతీష్