యాక్షన్ సినిమాల్లో 'కిల్' ప్రత్యేకం!
5 months ago | 63 Views
’స్నోఫియర్’, ’కిల్’.. రెండూ వేర్వేరు కథలు. రెండిరటిలోనూ ట్రైన్‌లో యాక్షన్ సీక్వెన్స్ మాత్రమే కామన్ పాయింట్ అని చెప్పారు యాక్షన్ కొరియోగ్రాఫర్ సీ యంగ్ ఓ లక్ష్ లల్వానీ హీరోగా, తాన్య హీరోయిన్‌గా నటించిన ’కిల్’ జులై 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి టాక్, వసూళ్లు అందుకుంటున్న ఈ సినిమాకు దక్షిణ కొరియా చెందిన యాక్షన్ కొరియోగ్రాఫర్ సీ యంగ్ ఓ పని చేసిన విషయం తెలిసిందే. ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇప్పటివరకు వచ్చిన యాక్షన్ చిత్రాలన్నిటిలో ’కిల్’ ప్రత్యేకం.
ఇందులో యాక్షన్ సన్నివేశాల కోసం చాలా కష్టపడ్డాం. ట్రైన్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించడం కోసం నెలల సమయం పట్టింది. ’స్నోఫియర్’, ’అవెంజర్స్’లో ఉన్న సీన్స్‌ను మరిపించేలా ఈ సినిమాలో సన్నివేశాలు ఉండాలని దర్శకుడు ముందే కోరారు. దీంతో ట్రైన్ యాక్షన్ సీన్స్‌ని సవాలుగా తీసుకొని చేశాం. ట్రైన్ లోపల ఉండే చిన్న స్థలంలో అలాంటి యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించడం కష్టం. వీటి కోసం ప్రత్యేక సెట్ వేశాం.. అయినప్పటికీ రోజూ ఎవరో ఒకరికి గాయాలయ్యేవి. అయితే ఎవరికీ ప్రమాదకరమైన గాయాలు కాలేదు‘ అని చెప్పారు.
ఇంకా చదవండి: ఆహాలో చాందిని చౌదరి 'యేవమ్' రిలీజ్.. నేటి నుంచి స్ట్రీమింగ్
# Kill # LakshLalwani # Tanya # TeluguCinema