
ZEE5లో ఫిబ్రవరి 15 నుంచి స్ట్రీమింగ్ కానున్న కిచ్చా సుదీప్ రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘మ్యాక్స్’
2 months ago | 5 Views
మాస్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్ అయిన ‘మ్యాక్స్’ డిజిటల్ ప్రీమియర్‌ను ZEE5 ప్రకటించింది, కన్నడ బాద్ షా రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘మ్యాక్స్’ మూవీ ఫిబ్రవరి 15న రాత్రి 7:30 గంటలకు జీ5లో స్ట్రీమింగ్ కానుంది. నూతన దర్శకుడు విజయ్ కార్తికేయ డైరెక్షన్‌లో వచ్చిన ఈ హై ఆక్టేన్, హార్ట్ రేసింగ్ రోలర్‌కోస్టర్ మూవీకి థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. మాస్ అవతార్‌లో కిచ్చా సుదీప్ చాలా కొత్తగా కనిపించారు. కన్నడ బాక్సాఫీస్ వద్ద మ్యాక్స్ రికార్డులు సృష్టించింది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళంలోనూ మంచి ఆదరణను దక్కించుకుంది.
కిచ్చా సుదీప్‌తో పాటుగా ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్, సంయుక్త హోర్నాడ్, సుకృతా వాగ్లే, సునీల్, అనిరుధ్ భట్ వంటి వారి నటించి మెప్పించారు. కలైపులి ఎస్. థాను (వి క్రియేషన్స్), కిచ్చా సుదీప (కిచ్చా క్రియేషన్స్) నిర్మించిన ఈ థ్రిల్లింగ్ చిత్రం ఇప్పటికే 2024లో అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రంగా నిలిచింది. ఇక ఈ మ్యాక్స్ ZEE5లోకి వచ్చే సమయం ఆసన్నమైంది.
పోలీసు ఇన్‌స్పెక్టర్ అర్జున్ మహాక్షయ్ (కిచ్చా సుదీప్)గా మ్యాక్స్‌లో కిచ్చా సుదీప్ అదరగొట్టేశారు. పోలీస్ ఆఫీసర్ పవర్, గ్యాంగ్ స్టర్‌లను పరుగులు పెట్టించే నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో కిచ్చా సుదీప్ మెప్పించారు. ఒక్క రాత్రిలో జరిగే ఘటనలను ఎంతో గ్రిప్పింగ్‌గా చూపించి ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నారు. జీ5లోకి మ్యాక్స్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న సందర్భంగా..
ZEE5 ప్రతినిధి మాట్లాడుతూ.. ‘అల్టిమేట్ మాస్ బ్లాక్‌బస్టర్ అయిన మ్యాక్స్ చిత్రాన్ని ZEE5 ప్రేక్షకులకు అందించడం పట్ల మేం సంతోషంగా ఉన్నాం. కిచ్చా సుదీప్, సినిమా టీం ఇచ్చిన ఈ సహకారం మాకు ఒక అద్భుతమైన మైలురాయిని అందించేలా చేసింది. మ్యాక్స్ ఒక థ్రిల్లింగ్ యాక్షన్-ప్యాక్డ్ రైడ్, హై-ఆక్టేన్ డ్రామాగా అందరినీ ఆకట్టుకుంది. గ్రిప్పింగ్ స్టోరీలైన్, కిచ్చా సుదీప్ అద్భుతమైన యాక్టింగ్‌కు జీ5 వీక్షకులు కూడా ఆశ్చర్యపోతారని మేం నమ్ముతున్నాం. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించడంతో.. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళంలోని అభిమానులకు అదే ఆడ్రినలిన్ రష్‌ని నేరుగా మా వీక్షకులకు అందించబోతోన్నాం’ అని అన్నారు.
కిచ్చా సుదీప్ మాట్లాడుతూ..‘మ్యాక్స్ మూవీ ZEE5లో స్ట్రీమింగ్ అవుతుండంట నాకు ఆనందంగా ఉంది. ముఖ్యంగా థియేటర్లలో విడుదలైన క్షణం నుంచి అభిమానులు, ఆడియెన్స్‌ను నుంచి ప్రేమ లభిస్తూనే వచ్చింది. పోలీస్ ఇన్‌స్పెక్టర్ అర్జున్ మహాక్షయ్ పాత్రలో నటించడం గొప్ప అనుభవం. యాక్షన్, ఎమోషన్, ఇంటెన్స్ డ్రామాతో నిండిన ఈ మూవీని ఇప్పుడు జీ5లో అందరూ చూడబోతోన్నారు. మాక్స్ డిజిటల్‌గా ప్రీమియర్‌లను ప్రదర్శిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మరింత ఎక్కువ మందికి చేరుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
దర్శకుడు విజయ్ కార్తికేయ మాట్లాడుతూ.. ‘మ్యాక్స్ జర్నీ నాకు ఎంతో ప్రత్యేకం. నాకు ఈ ప్రయాణం ఒక అద్భుతమైన అనుభవం. సినిమా అందరికీ నచ్చినందుకు, మెచ్చినందుకు చాలా గర్వపడుతున్నాను. ప్రేక్షకులను కట్టిపడేసేలా గ్రిప్పింగ్, యాక్షన్‌తో కూడిన కథను రూపొందించడమే నా లక్ష్యం. బాక్సాఫీస్ వద్ద వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్‌తో విజయం సాధించాం. ZEE5లోకి మ్యాక్స్ రాబోతోండటం ఆనందంగా ఉంద’ని అన్నారు.
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# మ్యాక్స్ # కిచ్చా సుదీప్ # ZEE5