'గేమ్‌ ఛేంజర్‌' నుంచి కియారా పోస్టర్‌!

'గేమ్‌ ఛేంజర్‌' నుంచి కియారా పోస్టర్‌!

4 months ago | 50 Views

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా, డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ’గేమ్‌ చేంజర్‌’. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మాతలు దిల్‌ రాజు , శిరీష్‌ ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ట్రిపుల్‌ ఆర్‌ వంటి సెన్సేషనల్‌ బ్లాక్‌ బస్టర్‌ మూవీ తర్వాత రామ్‌ చరణ్‌ నటిస్తోన్న సినిమా అవడంతో మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన జరగండి అనే పాటను మంచి హైప్‌ను తీసుకువచ్చాయి. తాజాగా బుధవారం చిత్ర హీరోయిన్‌ కియారా అద్వాని పుట్టిన రోజును పురస్కరించుకుని ’గేమ్‌ చేంజర్‌’ సినిమా నుంచి కియారా అద్వాని లుక్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేస్తూ మా జాబిలమ్మకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ పోస్టర్‌ విడుదల చేశారు. ఇదిలాఉండగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉండగా డిసెంబర్‌లో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ప్రముఖ తమిళ దర్శకుడు జిగర్తాండ పేమ్‌ కార్తీక్‌ సుబ్బరాజ్‌ ఈ సినిమాకు కథ అందించడం విశేషం. తమన్‌ సంగీతం అందిస్తున్నాడు.

# Gamechanger     # Ramcharan     # Kiaraadvani    

trending

View More