'హరిహరవీరమల్లు'పై కీలక అప్‌డేట్‌...  మార్చి 28న విడుదల కానున్నట్లు ప్రకటన!

'హరిహరవీరమల్లు'పై కీలక అప్‌డేట్‌... మార్చి 28న విడుదల కానున్నట్లు ప్రకటన!

1 day ago | 15 Views

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా రూపొందుతున్న పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ 'హరి హర వీరమల్లు’ క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఇది సిద్ధమవుతోంది. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తొలి భాగానికి సంబంధించి చిత్రీకరణ ముగింపుదశకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 'హరిహర వీరమల్లు’ రిలీజ్‌ డేట్‌ను చిత్రబృందం తాజాగా ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా దీనిని విడుదల చేయనున్నట్లు తెలిపింది. 'అన్‌స్టాపబుల్‌ ఫోర్స్‌, అన్‌బ్రేకబుల్‌ స్పిరిట్‌' మార్చి 28న విడుదల కానుంది’ అని పేర్కొంది. దీనిపై పవన్‌ అభిమానులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఈ సినిమా చిత్రీకరణ వాయిదా పడుతూ వస్తోంది. తన సన్నివేశాలను పూర్తి చేసేందుకు తాజాగా ఆయన అంగీకరించారు.

ఈ క్రమంలోనే సోమవారం ఉదయం 7 గంటలకు విజయవాడలో సిద్ధం చేసిన భారీ సెట్‌లో షూట్‌ మొదలైంది. ఈ విషయాన్నీ చిత్రనిర్మాణ సంస్థ తెలియజేసింది. హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్‌ నిక్‌ పాల్‌ ఆధ్వర్యంలో భారీ యాక్షన్‌ సన్నివేశాలు ఇక్కడ షూట్‌ చేయనున్నారని సమాచారం. పవన్‌తోపాటు కీలక నటీనటులు ఇందులో భాగం కానున్నారని తెలుస్తోంది.రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ తొలిభాగం 'హరిహర వీరమల్లు పార్ట్‌ 1: స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ పేరుతో విడుదల కానుంది. అనుపమ్‌ఖేర్‌, బాబీ డియోల్‌, నిధి అగర్వాల్‌, నోరాహి ఫతేహి, విక్రమ్‌ జీత్‌, జిషుసేన్‌ గుప్త కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఇది నిర్మితమవుతోంది.

ఇంకా చదవండి: 'దేవర' ప్రీ రిలీజ్‌ రద్దు..పుష్ప మేకర్స్‌ జాగ్రత్తలు!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# Hariharaveeramallu     # Pawankalyan     # Tollywood    

trending

View More