ఘనంగా

ఘనంగా "కావేరి" మూవీ సక్సెస్ మీట్

2 months ago | 29 Views

రిషిత, ఫైజల్, షేక్ అల్లాబకషు, ఖుషీ యాదవ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా "కావేరి". స్యాబ్ క్రియేషన్స్ బ్యానర్ పై షేక్ అల్లాబకషు నిర్మించిన ఈ చిత్రానికి రాజేష్ నెల్లూరు దర్శకత్వం వహించారు. ఆగస్టు 30న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ సినిమా, ప్రేక్షకుల మెప్పు పొందుతూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో సక్సెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం.. ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపి, తమ సంతోషాన్ని పంచుకుంది. ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతో పాటు, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్మాత షేక్ అల్లాబకషు మాట్లాడుతూ.. "ఆగస్టు 30న విడుదలైన మా కావేరి చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇది మంచి ఎమోషనల్ మరియు ఇన్స్పిరేషనల్ మూవీ. ఇటువంటి చిత్రం నిర్మించడం ఆనందంగా, గర్వంగా ఉంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మంచి సినిమా చేశారని ప్రశంసిస్తున్నారు. మహిళలు ఏ విధంగా స్ట్రాంగ్ గా ఉండాలని చూపించిన విధానం బాగుందని కొనియాడుతున్నారు. ఈ సినిమా ఇంతటి విజయం సాధించడానికి ముఖ్య కారకులు దర్శకులు రాజేష్ నెల్లూరు గారు. మొదటి సినిమా అయినప్పటికీ చాలా బాగా తెరకెక్కించారు. రిషిత, ఫైజల్ తో పాటు మిగతా నటీనటులంతా అద్భుతంగా నటించారు. ఇక ఈ సినిమాలో ఎమోషన్ ఇంత బాగా క్యారీ అవడానికి కారణం రాజ్ కిరణ్ గారి సంగీతం. ఆయన అద్భుతమైన సంగీతం అందించారు. ఈ సినిమాని ఇంతలా ప్రమోట్ చేసి, ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లిన పీఆర్ఓ వెంకటేష్ గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు. మరో రెండు మూడు నెలల్లో 'చెన్నై బజార్' అనే మంచి కమర్షియల్ సినిమా మా బ్యానర్ నుంచి రాబోతుంది. నిజానికి 'చెన్నై బజార్' దర్శకుడు జనార్దన్ గారి ద్వారానే 'కావేరి' లాంటి మంచి కథ మా దగ్గరకు వచ్చింది" అన్నారు.


డైరెక్టర్ రాజేష్ నెల్లూరు మాట్లాడుతూ.. " ఈ సినిమా మొదలు కావడానికి ప్రధాన కారణం మా కెమెరామ్యాన్ నాగేంద్ర బన్నీ. అతని సపోర్ట్ తో ఈ మూవీ ఇక్కడివరకు వచ్చింది. ఈ సినిమాకి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ పేరుపేరునా కృతఙ్ఞతలు. తక్కువ బడ్జెట్ లో కూడా మంచి సినిమా చేయగలమని నిరూపించిన చిత్రమిది. క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 30న విడుదలైంది. చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని ప్రశంసిస్తున్నారు. ఇలాంటి మంచి సినిమా చేయడానికి కారణమైన నిర్మాత షేక్ అల్లాబకాషు గారికి, నాకు సపోర్ట్ చేసిన జనార్దన్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను." అన్నారు.

హీరో ఫైజల్ మాట్లాడుతూ.. "ముందుగా మీడియా వారికి కృతఙ్ఞతలు. మీ మీడియా లేకపోతే సినిమా ఇంత దూరం వచ్చేది కాదు. ఈ సినిమా విషయంలో ముందుగా నేను మా దర్శకుడు రాజేష్ నెల్లూరు గారికి, నిర్మాత షేక్ అల్లాబకషు గారికి థాంక్స్ చెప్పుకోవాలి. వీరిద్దరూ లేకపోతే.. మేం ఇంతదూరం వచ్చి, ఇప్పుడిలా సక్సెస్ మీట్ లో కూర్చునేవాళ్ళం కాదు. ఇది ఒక కుర్రాడి కల. తెరమీద తన పేరు చూసుకోవాలన్న కల. నా పదేళ్ల కలను నిజం చేసిన 'స్యాబ్ క్రియేషన్స్' షేక్ అల్లాబకషు గారికి థాంక్స్. సినిమాకి మంచి స్పందన లభిస్తోంది. సినిమా చూసి థియేటర్ నుంచి ఎమోషనల్ గా బయటకు వచ్చామని నాకు ఎందరో మెసేజ్ లు చేశారు. అలాగే సినిమాలో మేము అనుకున్న థ్రిల్లింగ్ ఎలిమెంట్ బాగా వర్కౌట్ అయింది. అన్ని చోట్ల నుంచి వస్తున్న పాజిటివ్ ఫీడ్ బ్యాక్ చూసి సంతోషంగా ఉంది. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికి మంచి పేరు వస్తోంది. ముఖ్యంగా రాజ్ కిరణ్ సంగీతానికి, నాగేంద్ర బన్నీ విజువల్స్ కి అందరూ ఫిదా అయ్యారు. మేము ఏది అడిగినా ఇచ్చి, ఎక్కడా రాజీ పడకుండా సినిమాని నిర్మించిన నిర్మాత షేక్ అల్లాబకషు గారికి థాంక్యూ సో మచ్. ఇంత మంచి కాన్సెప్ట్ ని ఇచ్చిన దర్శకుడు రాజేష్ గారికి.. నా తరపున, రిషిత తరపున ప్రత్యేక కృతఙ్ఞతలు." అన్నారు. 

డైరెక్టర్ జనార్దన్ మాట్లాడుతూ(గెస్ట్) మాట్లాడుతూ..  స్యాబ్(SAB) అంటే షేక్ అల్లాబకషు. తన పేరునే బ్యానర్ గా పెట్టి, వరుసగా మూడు సినిమాలు చేస్తున్నారు. ముందుగా 'చెన్నై బజార్' మొదలుపెట్టి, ఆ తర్వాత 'కావేరి' చేసి, ఇప్పుడు 'మాస్ గాడు' చేస్తున్నారు. ఆడవారికి ఎంతో సహనం ఉంటుంది. ఆ సహనం నశిస్తే ఆదిపరాశక్తిని చూస్తాం. అదే పాయింట్ తో దర్శకుడు రాజేష్ 'కావేరి' కథను సిద్ధం చేసుకున్నారు. ఆ కథను తీసుకొని నిర్మాత షేక్ అల్లాబకషు గారి దగ్గరకు వచ్చారు. నిర్మాతలు కమర్షియల్ సినిమాలు తీయాలి, బ్యాంక్ బ్యాలెన్స్ నిండాలి అనుకుంటారు. కానీ అల్లాబకషు గారు మాత్రం మంచి సినిమాలు తీయాలనే లక్ష్యంతో వచ్చారు. కావేరి చిత్రం మంచి సినిమాగా పేరు తెచ్చుకోవడమే కాకుండా, మంచి వసూళ్లు కూడా రాబడుతుండటం సంతోషం కలిగించే విషయం. అల్లాబకషు గారు భవిష్యత్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదుగుతారు. దర్శకుడు రాజేష్ కథని అద్భుతంగా రాసుకోవడమే కాకుండా, అంతే అద్భుతంగా తెరమీదకు తీసుకొచ్చారు. ఆయనకు డీఓపీ నాగేంద్ర బన్నీ, సంగీత దర్శకుడు రాజ్ కిరణ్, ఎడిటర్ నరేష్ దొరపల్లి చక్కని సహకారం అందించారు. అలాగే హీరో ఫైజల్, హీరోయిన్ రిషిత చక్కగా నటించారు. వారికి మంచి భవిష్యత్ ఉంది." అన్నారు.

నటీనటులు : రిషిత, ఫైజల్, షేక్ అల్లాబకషు, ఖుషీ యాదవ్, లక్ష్మి ప్రియా, గుజ్జల సుధీర్ రెడ్డి, ప్రశాంత్ కుమార్ రెడ్డి దువ్వూరు, తదితరులు 

సాంకేతిక నిపుణులు

బ్యానర్: స్యాబ్ క్రియేషన్స్ 

నిర్మాత: షేక్ అల్లా బకషు

రచన, దర్శకత్వం: రాజేష్ నెల్లూరు

ఎడిటర్: నరేష్ దొరపల్లి

డీఓపీ: నాగేంద్ర బన్నీ 

సంగీతం: రాజ్ కిరణ్

సింగర్స్: ఐశ్వర్య, దీపు, వినాయక రావు & వేణు 

సాహిత్యం: జివి ప్రతాప్ చౌదరి, రామారావు, సాజిద్, కె

వెంకటేశ్వరరావు

పి.ఆర్.ఓ: తిరుమలశెట్టి వెంకటేష్

ఇంకా చదవండి: నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా "ది డీల్" మోషన్ పోస్టర్ విడుదల

# Kaveri     # Rishitha     # Faizel    

trending

View More