తెలుగులో 'సత్యం సుందరం' పేరుతో కార్తీ చిత్రం

తెలుగులో 'సత్యం సుందరం' పేరుతో కార్తీ చిత్రం

2 months ago | 31 Views

కోలీవుడ్‌ స్టార్‌ యాక్టర్లు కార్తీ , అరవింద్‌ స్వామి లీడ్‌ రోల్స్‌లో నటించిన తమిళ చిత్రం మెయ్యళగన్‌. 96 ఫేం ప్రేమ్‌ కుమార్‌ సీ దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగులో ’సత్యం సుందరం’  పేరుతో విడుదల కానుంది. సెప్టెంబర్‌ 28న తెలుగు రాష్టాల్ల్రో విడుదలవుతోంది. సోమవారం ప్రమోషన్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన తెలుగు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు హనుమాన్‌ దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ప్రశాంత్‌ వర్మ ఆసక్తికర విషయమొకటి చెప్పి అందరిలో జోష్‌ నింపాడు. ఇటీవలే నేను ఓ స్క్రిప్ట్‌ గురించి చర్చించేందుకు కార్తీని చెన్నైలో కలిశానని చెప్పాడు. ఆ తర్వాత తాను కథకు ఇంప్రెస్‌ అయ్యానని.. అది మాస్‌ రోల్‌ అని కార్తీ అన్నాడు.


ఈ కామెంట్స్‌తో ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో కార్తీ జాయిన్‌ అయ్యే అవకాశాలున్నాయని ఫిక్సయిపోతున్నారు అభిమానులు, మూవీ లవర్స్‌. ప్రశాంత్‌ వర్మ ప్రస్తుతం నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ సినిమాతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. కార్తీ ఈ సినిమాలో భాగం కాబోతున్నాడంటూ వార్తలు హల్‌ చల్‌ చేస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో కార్తీ` ప్రశాంత్‌ వర్మ కాంబోలో సినిమా వస్తుందేమో చూడాలి. ప్రశాంత్‌ వర్మ మరోవైపు హనుమాన్‌ సీక్వెల్‌ ప్రాజెక్ట్‌ జై హనుమాన్‌ను కూడా లైన్‌లో పెట్టాడని తెలిసిందే.

ఇంకా చదవండి: నార్త్‌ అమెరికాలో 'దేవర' ప్రీసేల్స్‌ అదుర్స్‌!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# SathyamSundaram     # Karthi     # SwathiKonde     # September28    

trending

View More