డిసెంబర్‌లో 'కన్నప్ప' విడుదల.. 'పుష్పా2'తో పోటీకి సన్నద్దం !
5 months ago | 49 Views
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న చిత్రం 'కన్నప్ప’ ముకేశ్ కుమార్‌సింగ్ దర్శకుడు. భారీ బడ్జెట్, పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా విడుదల కోసం సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా విష్ణు పెట్టిన పోస్ట్‌తో రిలీజ్‌పై కారిటీ వచ్చింది. 'డిసెంబరు 2024' అని ఆయన ట్వీట్ చేశారు. కన్నప్ప హ్యాష్‌ట్యాగ్ జోడించారు. విడుదల తేదీని త్వరలోనే ప్రకటించే అవకాశాలున్నాయి. 'పుష్ప 2’ డిసెంబరు 6న రిలీజ్ చేయనున్నట్టు టీమ్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. 'కన్నప్ప’ డిసెంబరు మూడు, నాలుగో వారంలో విడుదలయ్యే అవకాశాలున్నాయని సినీ వర్గాల సమాచారం. ఈ పాన్ ఇండియా చిత్రంలో ప్రీతి ముకుందన్ హీరోయిన్. ప్రభాస్, అక్షయ్ కుమార్, శరత్‌కుమార్, మోహన్‌లాల్ తదితరులు ఈ సినిమాలో సందడి చేయనున్నారు. విష్ణు.. తిన్నడు పాత్ర పోషించారు. అధిక భాగం షూటింగ్ న్యూజిలాండ్‌లో జరిగింది. కన్నప్ప భక్తి చిత్రం మాత్రమే కాదని, అదొక చరిత్ర అని మోహన్ బాబు ఓ సందర్భంలో అన్నారు. ఈ చిత్రానికి ఆయన నిర్మాతగా వ్యవహరించడంతో పాటు ఓ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా టీజర్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రదర్శితమైన సంగతి తెలిసిందే. ఇటీవల సోషల్ విూడియాలోనూ విడుదలై, ప్రేక్షకులను అలరించింది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ విడుదల చేయగా హాలీవుడ్ లెవల్లో ఉన్న ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాను డిసెంబర్‌లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.ఒకవేళ ఇదే నిజమైతే మంచు విష్ణు భారీ సాహసం చేయబోతున్నాడు. ఎందుకంటే ఇప్పటికే డిసెంబర్‌ను బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ బుక్ చేసుకుంది. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప ది రూల్ రాబోతుంది. డిసెంబర్‌లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ సినిమాకు పోటిగా కన్నప్పను దించడం అనేది సాహసంతో కూడుకున్న పని అని ఇది కన్నప్పకు ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. కాగా కన్నప్ప విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇంకా చదవండి: అల్లు అర్జున్‌తో సుకుమార్ గొడవ పడ్డారా?... చిత్రం షూటింగ్ డిలేపై సర్వత్రా అనుమానాలు!