'కన్నప్ప' విధేయుడు..గుర్రం పోస్టర్ విడుదల!
3 months ago | 41 Views
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం విడుదల చేస్తున్న అప్డేట్ రోజురోజుకు సినిమాపై అంచనాలు పెంచుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు ఈ 'కన్నప్ప' మూవీలో ప్రధాన పాత్రల్లో నటించిన శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లు రిలీజ్ చేయగా అవన్నీ క్యూరియాసిటీని పెంచాయి. ఇక గత సోమవారం అక్షయ్ కుమార్ శివుడి పాత్రకు సంబంధించి ప్రీ లుక్‌ను విడుదల చేశారు.
తాజాగా కన్నప్ప నుంచి విష్ణు మంచు మరో స్టన్నింగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో తిన్నడికి అత్యంత విధేయుడైన స్నేహితుడు.. టిక్కిని పరిచయం చేశారు. అయితే ఆ స్నేహితుడు గుర్రం కావడం గమనార్హం. ఇప్పుడు ఈ గుర్రంకు సంబంధించిన పోస్టర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అదేవిధంగా ఈ పోస్టర్‌లో గుర్రంపై విష్ణు మంచు లుక్ అదిరిపోయేలా ఉంది. ఇప్పటికే రిలీజైన కన్నప్ప టీజర్ సినిమా విూద భారీ అంచనాలను పెంచగా డిసెంబర్‌లో ఈ సినిమా పాన్ ఇండియా వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇంకా చదవండి: 'జీబ్రా' ఫస్ట్ లుక్ అదుర్స్!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# Kannappa # VishnuManchu # Prabhas