'కంగువ' ట్రైలర్‌ విడుదల!

'కంగువ' ట్రైలర్‌ విడుదల!

4 months ago | 37 Views

కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య నటిస్తోన్న పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా ప్రాజెక్ట్‌ 'కంగువ'. సూర్య 42వ ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ మూవీకి శివ  దర్శకత్వం వహిస్తున్నాడు. మూవీ లవర్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'కంగువ' ట్రైలర్‌ రానే వచ్చింది. మేకర్స్‌ నేడు ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు.


ఓ రహస్యమైన ద్వీపంలో గిరిజనులందరినీ నియంత్రించేందుకు క్రూరమైన అధిరన్‌, అతని గ్యాంగ్‌ దురాగతాలతో మొదలైంది.బాబీ డియోల్‌ను మునుపెన్నడూ చూడని అవతార్‌లో శక్తివంతమైన పాత్రలో కనిపిస్తుండగా.. అతడి గ్యాంగ్‌ నుంచి అమాయక ప్రజలను రక్షించేందుకు సూర్య ఎంట్రీ ఇచ్చే సన్నివేశాలు రోమాలు నిక్కపొడుచుకునేలా సాగుతూ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. కంగువలో బాలీవుడ్‌ భామ దిశాపటానీ ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోండగా.. బాబీ డియోల్‌ ఉధిరన్‌ పాత్రలో నటిస్తున్నాడు. కంగువ రెండు పార్టులుగా రాబోతుండగా.. కంగువ పార్టు 1 ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్‌ 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే లాంచ్‌ చేసిన కంగువ గ్లింప్స్‌ వీడియో, పోస్టర్లు సినిమాపై సూపర్‌ హైప్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌-యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ మూవీకి రాక్‌ స్టార్‌ దేవీ శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో పాపులర్‌ టాలీవుడ్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ మైత్రీ మూవీ మేకర్స్‌ విడుదల చేస్తోంది.

ఇంకా చదవండి: అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో స్టార్‌ హీరోల సినిమాలను దాటేసిన 'స్త్రీ-2'

# Kanguva     # Suriya     # Dishapatani    

trending

View More