నవంబర్ 14కు లాక్ చేసిన 'కంగువా'
3 months ago | 40 Views
తమిళ హీరో సూర్య కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం ’కంగువా’ శివ దర్శకుడు. స్టూడియోగ్రీన్ పతాకంపై కె.ఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంది. అక్టోబర్ 10న విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం కొత్త రిలీజ్ డేట్‌ను చిత్రబృందం గురువారం ఉదయం ప్రకటించింది. నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపింది. దీంతో సినీ ప్రియులు, సూర్య అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో సూర్య మూడు భిన్నమైన లుక్స్‌లో కనిపిస్తారు. దిశాపటానీ కథానాయిక. బాబీ దేవోల్ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపిస్తారు. ఓ కొత్త కాన్సెప్ట్‌తో పది భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
అంతర్జాతీయ భాషల్లోనూ విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే అక్టోబర్ 10న ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే అదే రోజున రజనీకాంత్ నటించిన 'వేట్టయాన్’ రిలీజ్ ఉండటంతో తమ చిత్రాన్ని వాయిదా వేస్తున్నామని ఇటీవల ఓ కార్యక్రమంలో సూర్య పరోక్షంగా తెలిపారు. ‘తమిళ చిత్ర పరిశ్రమ నుంచి ఒక ప్రత్యేకమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించేందుకు దాదాపు రెండున్నరేళ్ల పాటు సుమారు 1000 మందికి పైగా 'కంగువా’ కోసం కష్టపడ్డాం. దర్శకుడుతోపాటు యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ క్లిష్టమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొని పనిచేశాం. కష్టపడి పని చేస్తే దాని ఫలితం ఎక్కడికీ పోదని నేను గట్టిగా నమ్ముతా. మా సినిమా ఎప్పుడు విడుదలైనా విూరు తప్పకుండా అభిమానం, ప్రేమ చూపిస్తారనే నమ్మకం ఉంది. అక్టోబర్ 10న రజనీకాంత్ నటించిన 'వేట్టయాన్’ రిలీజ్ అవుతుంది. ఆయన సీనియర్ ఆర్టిస్ట్. నేను పుట్టే సమయానికే ఆయన యాక్టింగ్‌లోకి వచ్చారు. కాబట్టి ఆయన చిత్రమే ముందు వస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం' అని ఇటీవల చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో సూర్య తెలిపారు.
ఇంకా చదవండి: బయటకు వచ్చిన 'స్వయంభు' వర్కింగ్ స్టిల్ !
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# Kanguva # Suriya # Dishapatani # November14