సెప్టెంబర్‌ 6న 'ఎమర్జెన్సీ' విడుదల ..  ప్రకటించిన కంగనా రనౌత్‌

సెప్టెంబర్‌ 6న 'ఎమర్జెన్సీ' విడుదల .. ప్రకటించిన కంగనా రనౌత్‌

4 days ago | 13 Views

బాలీవుడ్‌ కథానాయిక కంగనా రనౌత్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎమర్జెన్సీ' సినిమా కొత్త విడుదల తేదీని కంగనా ప్రకటించారు.  సెప్టెంబర్‌ 6న 'ఎమర్జెన్సీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానున్నట్లు వెల్లదించారు.  'ఎమర్జెన్సీ కంగనాకు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌. 'మణికర్ణిక’ తర్వాత ఆమె డైరెక్ట్‌ చేసిన రెండో సినిమా ఇది. ఈ ప్రాజెక్ట్‌ కోసం జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ప్రతిభావంతులు పని చేశారు. మొదట ఈ సినిమాను గతేడాది నవంబర్‌ 24న విడుదల చేయాలని భావించారు. ఆతర్వాత జూన్‌ 14కు మరోసారి వాయిదా వేశారు. ఇప్పుడు అన్ని పనులు పూర్తికావడంతో సెప్టెంబర్‌ 6ను ఫిక్స్‌ చేశారు.

గతంలో ఓ సందర్భంలో కంగనా ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. తనకు సంబంధించిన ఆస్తులన్నింటినీ దీనికోసం తనఖా పెట్టినట్లు చెప్పారు. మొదటి షెడ్యూల్‌ సమయంలో డెంగీ బారినపడి రక్తకణాల సంఖ్య భారీగా పడిపోయినా షూట్‌లో పాల్గొనాల్సి వచ్చిందన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి కంగనా నిర్మాతగానూ వ్యవహరించారు. జయప్రకాష్‌ నారాయణ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో శ్రేయస్‌ తల్పడే కనిపించనున్నారు.

ఇంకా చదవండి: కాస్టింగ్ కాల్ అనౌన్స్ చేసిన హీరో విజయ్ దేవరకొండ భారీ పాన్ ఇండియా మూవీ "వీడీ 14" టీమ్

# Emergency     # Kangana Ranaut    

related

View More
View More