కాందహార్ విమాన హైజాక్.. నెట్‌ఫ్లిక్స్ వెబ్ సీరిస్
4 months ago | 47 Views
1999లో జరిగిన కాందహార్ విమానం హైజాక్ ఘటన గుర్తుందా.. ఈ ఘటనపై తాజాగా నెట్‌ప్లిక్స్ వెబ్ సిరీస్ తెరకెక్కిస్తుంది. 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ హైజాక్ అయిన విషయం తెలిసిందే. 1999 డిసెంబర్ 24న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఐసీ814 నేపాల్ రాజధాని కాఠ్‌మాండూ నుంచి లఖ్‌నవూకు వస్తుండగా సాయంత్రం 5 గంటలకు భారత గగనతంలోకి ప్రవేశించగానే అందులోని హైజాకర్లు విమానాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ విమానాన్ని హైజాక్ చేస్తున్నామని చెప్పి అమృత్ సర్, లాహోర్, దుబాయిల విూదుగా ఆఫ్ఘానిస్తాన్ లోని కాందహార్‌కు తరలించారు. ఇక ఈ విమానంలో 176 మంది ప్రయాణికులు, మరో 15 మంది సిబ్బంది ఉన్నారు. ఇండియన్ మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాదిగా ఉన్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజహర్‌తో పాటు తమ సహచరులు 36 మందిని విడుదల చేయాలని అలాగే 200 మిలియన్ డాలర్లు (రూ.1400 కోట్లు) ఇవ్వాలని హైజాకర్లు భారత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇక వీరి డిమాండ్లకు ఒప్పుకున్న భారత ప్రభుత్వం మసూద్ అజహర్‌తో పాటు ముశ్తాక్ జర్గర్, అహ్మద్ ఉమర్ సయీద్ శేఖ్‌లను విడుదల చేసింది. అనంతరం మసూద్ అజహర్ జైషే ఉగ్రవాద సంస్థను స్థాపించి 2001లో పార్లమెంట్‌పై దాడి, 2008లో ముంబై పేలుళ్లు, 2019లో పుల్వామా ఉగ్రదాడులకు ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. అయితే కాందహార్ ఘటన జరిగి 25 ఏండ్లు అవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఘటనపై వెబ్ సిరీస్ తెరకెక్కిస్తుంది నెట్‌ప్లిక్స్. దీనికి సంబంధించిన టీజర్‌ను తాజాగా విడుదల చేసింది. ఇక ఈ వెబ్ సిరీస్‌లో బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో పాటు తమిళ నటుడు అరవింద్ స్వామి, పంకజ్ కపూర్, నసీరుద్దీన్ షా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఉత్కంఠగా సాగిన ఈ టీజర్‌ను విూరు చూసేయండి. ఈ వెబ్ సిరీస్‌ను ఆగష్టు 29న స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది.
ఇంకా చదవండి: సూర్య 'కంగువ'తో పోటీపడలేరు: నిర్మాత
# Mushtaqzargar # Masoodazhar # Hollywood