కమలహాసన్ థగ్‌లైఫ్...షూటింగ్ పూర్తి
2 months ago | 35 Views
ఉలగనాయగన్ కమల్‌హాసన్ కాంపౌండ్ నుంచి వస్తోన్న తాజా చిత్రం 'థగ్ లైఫ్’. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం డైరెక్షన్‌లో వస్తోన్న థగ్ లైఫ్‌లో ఐశ్వర్యలక్ష్మి, త్రిష, ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ యాక్టర్ శింబు కీలక పాత్రలో నటిస్తుండగా.. గౌతమ్ కార్తీక్, జోజు జార్జ్, దుల్కర్ సల్మాన్, జయం రవి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా థగ్ లైఫ్ షూటింగ్ పూర్తయింది. అంతేకాదు ఈ మూవీ డిజిటల్ రైట్స్ రూ.149.7 కోట్లకు అమ్ముడుపోయాయి. ఈ మొత్తం కోలీవుడ్ సినీ చరిత్రలోనే అత్యధికం కావడం విశేషం. థగ్ లైఫ్ చిత్రాన్ని 2025 వేసవి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
కమల్ హాసన్ క్రేజ్ ఎలా రేంజ్‌లో ఉందో తాజా వార్త మరోసారి చెప్పకనే చెబుతోంది. కొత్త ఆరంభ సమయం.. కొత్త థగ్ కు స్వాగతం పలికే సమయం.. అంటూ మేకర్స్ షేర్ చేసిన శింబు వీడియో ఇప్పటికే నెట్టింటిని షేక్ చేస్తోంది. మణిరత్నం టీం ఇప్పటికే థగ్ లైఫ్ టీంతో డిజైన్ చేసిన వీడియో సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని కమల్ హాసన్`ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, రెడ్ జియాంట్ మూవీస్, మద్రాస్ టాకీస్ బ్యానర్లపై కమల్ హాసన్`ఆర్ మహేంద్రన్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
ఇంకా చదవండి: ఓటిటిలోకి వచ్చేసిన 'మారుతీనగర్ సుబ్రమణ్యం'
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# ThugLife # KamalHaasan # DulquerSalmaan