మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చిన 'కల్కి' వచ్చే నెలలోనే ఓటిటిలోకి అంటూ వార్తలు
2 months ago | 31 Views
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ 'కల్కి 2898 ఏడీ. సినిమా రిలీజై రెండు వారాలు పూర్తిచేసుకొని మూడో వారంలోకి అడుగుపెట్టింది. ముఖ్యంగా హాలీవుడ్ స్థాయిలో ఉన్న ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశాన్ని చూసి ప్రేక్షకులు మైమరిచిపోతున్నారు. ఈ సినిమాలో ప్రత్యేకంగా ఉన్న బుజ్జి కారు చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు ఆకట్టుకుంటుంది.
ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది. సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ఈ చిత్రం విడుదలై మూడు వారాలు పూర్తి చేసుకుంది. అయితే ఇప్పుడు 'కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయాలనుకుంటున్నారని తెలిసింది. ఈ చిత్రం ఓటీటీలో ఎప్పుడు వస్తుందా? అని చాలా మంది ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ఓటీటీలో మొదటగా ఈ సినిమాను హిందీ భాషలో విడుదల చేసి.. ఆ తరువాత తెలుగుతో పాటు ఇతర భాషల్లో అమోజాన్ ప్రైమ్ ద్వారా ఆగష్టు 15న రిలీజ్ అవుతున్నట్లు సమాచారం.
ఇంకా చదవండి: తనకు తానే సాటి అనిపించుకున్న కమల్ అవినీతి పోరాటంతో మరోమారు మెస్మరైజ్
# Kalki 2898 AD # Nag Ashwin # Prabhas