'కల్కి' విజయం ప్రభాస్‌కు  రొటీన్‌ కావచ్చు...గొప్పచిత్రంలో భాగమైనందుకు ఆనందిస్తున్నా: అమితాబ్‌

'కల్కి' విజయం ప్రభాస్‌కు రొటీన్‌ కావచ్చు...గొప్పచిత్రంలో భాగమైనందుకు ఆనందిస్తున్నా: అమితాబ్‌

5 months ago | 54 Views

ప్రభాస్‌ హీరోగా అమితాబ్‌బచ్చన్‌ కీలక పాత్రలో నటించిన సరికొత్త చిత్రం 'కల్కి 2898 ఏడీ’  రూ.1000 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా తమ చిత్రానికి వస్తోన్న విశేష స్పందనపై అమితాబ్‌ బచ్చన్‌ ఆనందం వ్యక్తంచేశారు. 'కల్కి’ ఘన విజయంలో భాగమైన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. ప్రేక్షకుల అభిమానం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి సక్సెస్‌లు ప్రభాస్‌కు రొటీన్‌గా మారాయని.. ఇటీవల కాలంలో ఆయన నటించిన చాలా చిత్రాలు రూ.1000 కోట్ల క్లబ్‌లోకి వచ్చాయని తెలిపారు. 'నా వరకూ ఇలాంటి గొప్ప చిత్రంలో భాగమైనందుకు ఆనందిస్తున్నా. ఈ చిత్రాన్ని నేను ఎంతగా ఎంజాయ్‌ చేశానో చెప్పడానికి మాటలు చాలడం లేదు. ఇప్పటికే నాలుగుసార్లు సినిమా చూశా. సినిమా చూసిన ప్రతిసారీ ఏదోఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటూనే ఉన్నా అని ఆయన చెప్పారు. నాగ్‌ అశ్విన్‌ విజన్‌, అశ్వనీదత్‌, ప్రియాంక, స్వప్న పనితీరును ఆయన ప్రశంసించారు. ఎపిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ మూవీగా ప్రేక్షకుల ముందుకువచ్చిన 'కల్కి’ కలెక్షన్లలో రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ రూ.1000 కోట్లకు పైగా రాబట్టినట్లు చిత్రబృందం తెలిపింది. అగ్ర నటులు అమితాబ్‌ బచ్చన్‌.. అశ్వత్థామగా, కమల్‌హాసన్‌.. సుప్రీంయాస్కిన్‌గా కీలకపాత్రలు పోషించారు. విజయ్‌ దేవరకొండ (అర్జునుడు), దుల్కర్‌ సల్మాన్‌ అతిథి పాత్రల్లో అలరించారు. సినిమా ఆరంభంలో బౌంటీటైర్‌ భైరవగా సందడి చేసిన ప్రభాస్‌.. చివరిలో కర్ణుడిగా కనిపించి పార్ట్‌-2పై మరిన్ని అంచనాలు పెంచేశారు.

అమెరికాలో యాక్సిడెంట్‌కు గురయ్యా... అందుకే చిత్రాలను తీసుకుని రాలేకపోయా: నవీన్‌ పోలిశెట్టి

ఇంకా చదవండి: 

# Kalki 2898 AD     # Nag Ashwin     # Prabhas    

trending

View More