'కల్కి' ప్రీ బుకింగ్స్‌లో రికార్డు.. సలార్‌ను మించి కలెక్షన్లు!

'కల్కి' ప్రీ బుకింగ్స్‌లో రికార్డు.. సలార్‌ను మించి కలెక్షన్లు!

3 days ago | 11 Views

 ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన 'కల్కి’ విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ప్రీ సేల్‌ బుకింగ్స్‌లో ఇప్పటికే కొన్ని బ్లాక్‌ బస్టర్‌ చిత్రాల రికార్డులను బ్రేక్‌ చేయగా.. ఇప్పుడు 'సలార్‌’ రికార్డును కూడా అధిగమించింది. ఈ సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ కల్కి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓవర్సీస్‌లో మాత్రం ఒకరోజు ముందుగానే విడుదల కానుంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రీ సేల్స్‌ ఓపెన్‌ చేయగా అవి ప్రభాస్‌  గత చిత్రం రికార్డును బ్రేక్‌ చేశాయి.'సలార్‌’ ప్రీ సేల్‌ బుకింగ్స్‌ను 'కల్కి’ రిలీజ్‌కు ఒక్కరోజు ముందుగానే క్రాస్‌ చేసింది. ఈ చిత్రం ప్రీ సేల్స్‌ ప్రారంభించిన గంటల్లోనే 'ఆర్‌ఆర్‌ఆర్‌’ రికార్డులను బ్రేక్‌ చేసింది.

ఇక ఇప్పటి వరకు కేవలం నార్త్‌ అమెరికాలోనే 1,25,000 టికెట్స్‌ అమ్ముడైనట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. మరోవైపు 'కల్కి’ ఓపెనింగ్‌ కలెక్షన్లు రూ.200 కోట్లు ఖాయమంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రభాస్‌ గతంలో నటించిన 'బాహుబలి`2’, 'సలార్‌’, 'ఆదిపురుష్‌’, 'సాహో’ చిత్రాలు మొదటిరోజు రూ.100కోట్లు సాధించిన సంగతి తెలిసిందే. వీటికంటే 'కల్కి’కి ఎక్కువ కలెక్షన్లు వచ్చే అవకాశమున్నట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నారు. ప్రభాస్‌ సరసన దీపికా పదుకొణె నటించిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌లో అగ్ర నటీనటులు అమితాబ్‌ బచ్చన్‌, దీపిక పదుకొణె, కమల్‌హాసన్‌  తదితరులు కీలక పాత్రలు పోషించారు. తాజాగా వీరంతా నాగ్‌ అశ్విన్‌పై, 'కల్కి’ కథపై ప్రశంసలు కురిపించారు.

ఇంకా చదవండి: ''కల్కి 2898 ఏడి'కి గతంలో ఏ సినిమాకు రానంత క్యూరియాసిటీ!

# Kalki 2898 AD     # Prabhas     # Deepika Padukone     # Kamal Haasan     # Disha Patani    

related

View More
View More