నెంబర్‌వన్‌ స్థానంలో నిలిచిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం

నెంబర్‌వన్‌ స్థానంలో నిలిచిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం

2 months ago | 5 Views

ప్రముఖ ఎంటర్‌టైన్మెంట్‌ పోర్టల్‌ ఇంటర్నెట్‌ మూవీ డేటా బేస్‌ ప్రతి సంవత్సరం దేశంలోని సినిమాల క్రేజ్‌ గురించి సర్వే నిర్వహించి.. మోస్ట్‌ పాపులర్‌ విభాగంలో టాప్‌ పొజిషన్‌లో ఉన్న సినిమాల జాబితాలను విడుదల చేస్తుందన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ఏడాది మోస్ట్‌ పాపులర్‌గా నిలిచిన సినిమాల జాబితాను ఐఎండీబీ విడుదల చేసింది.ఈ జాబితాలో ప్రభాస్‌ నటించిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం అగ్ర స్థానంలో ఉండగా.. బాలీవుడ్‌ బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న ‘స్త్రీ 2’ రెండో స్థానంలో నిలిచింది.

ఇక టాప్‌ టెన్‌లో ఉన్న సినిమాలు ఒకసారి చూసుకుంటే.! ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ ‘కల్కి 2898 ఏడీ. ది గ్రేట్‌ లెజెండ్స్‌ అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, హీరోయిన్‌ దీపిక పదుకొనే వంటి గొప్ప యాక్టర్స్‌ నటించిన ఈ చిత్రం జూన్‌ 27 న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్‌ బస్టర్‌ అందుకొవడమే కాకుండా.. రూ.1300 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం 2024 ఐఎండీబీ మోస్ట్‌ పాపులర్‌ సినిమా  విభాగంలో టాప్‌ పోజిషన్‌లో నిలిచింది.

ఇంకా చదవండి: ‘ప్రజాకవి కాళోజీ’ బయోపిక్! సినిమాకు విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన 

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# కల్కి 2898 ఏడీ     # ప్రభాస్‌    

trending

View More