ఓటీటీలో వంద మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో దూసుకుపోతోన్న ‘కళింగ’

ఓటీటీలో వంద మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో దూసుకుపోతోన్న ‘కళింగ’

1 month ago | 5 Views

కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలకు ఓటీటీలో వచ్చే ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డిఫరెండ్ కంటెంట్‌తో సినిమాలు తీస్తే ఓటీటీ ఆడియెన్స్ మాత్రం కచ్చితంగా ప్రశంసలు కురిపిస్తుంటారు. ఇక ఓటీటీలో ఈ మధ్య కొన్ని చిత్రాలు నెలల తరబడి ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో వచ్చిన ‘కళింగ’ చిత్రం ఓటీటీలో ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది. అమెజాన్ ప్రైమ్, ఆహాలో కళింగ చిత్రం దూసుకుపోతోంది.

కిరోసిన్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ధృవ వాయు ‘కళింగ’తో మరోసారి అందరినీ మెప్పించాడు. దర్శకుడిగా, హీరోగా కళింగ సినిమాతో అందరినీ ఆకట్టుకున్నాడు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 13న విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. థియేటర్లో ఆడియెన్స్ నుంచి ప్రశంసలు అందుకున్న ఈ మూవీ గత నెలలో ఓటీటీలోకి వచ్చి అందరినీ ఆకట్టుకుంది.

అమెజాన్ ప్రైమ్, ఆహాలో ప్రస్తుతం ఈ మూవీ ఇంకా ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే వంద మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో దూసుకుపోతోంది. కళింగ చిత్రంలోని హై టెక్నికల్ స్టాండర్డ్స్, విజువల్స్, ఆర్ఆర్, మేకింగ్‌తో ధృవా వాయు అందరినీ మెస్మైరజ్ చేశాడు. హీరోగా నటించడం ఒకెత్తు అయితే ఇంతటి టెక్నికల్ నాలెడ్జ్‌తో సినిమాను తీయడం మరో ఎత్తు అంటూ ప్రేక్షకులు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.

ఇంకా చదవండి: ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న 'ఈసారైనా' టీమ్.. దక్షిణాది భాషల్లో నవంబర్ 8 న ఘనంగా విడుదల కానుంది

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# కళింగ     # ధృవవాయు     # అమెజాన్ ప్రైమ్     # ఆహా     # ఓటీటీ    

trending

View More