ఆసక్తికర కథా కథనాలతో "కలి" మూవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది - దర్శకుడు శివ శేషు
1 month ago | 5 Views
యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిస్తున్న సినిమా "కలి". ఈ చిత్రాన్ని ప్రముఖ కధా రచయిత కె.రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మిస్తోంది. శివ శేషు దర్శకత్వం వహిస్తున్నారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర విశేషాలను తన ఇంటర్వ్యూలో తెలిపారు దర్శకుడు శివ శేషు.
- చిన్నప్పటి నుంచి సాహిత్యం చదవడం, రచనలు చేయడం అలవాటు. స్క్రిప్ట్ బాగా రాస్తాను. దర్శకుడు కావాలన్నది నా కోరిక. కొంతకాలం బిజినెస్ చేశాను గానీ తిరిగి నేను ఇష్టపడే చిత్ర పరిశ్రమకే వచ్చాను. కొన్ని సినిమాలకు ఘోస్ట్ రైటర్ గా పనిచేశాను. ఆ తర్వాత భాగమతి దర్శకుడు అశోక్ గారి దగ్గర, సప్తగిరి ఎక్స్ ప్రెస్ చిత్ర దర్శకుడు అరుణ్ పవార్ గారి దగ్గర పనిచేశాను.
- లాక్ డౌన్ టైమ్ లో కలి పేరుతో స్క్రిప్ట్ రెడీ చేశాను. ప్రిన్స్ కు చెబితే చాలా బాగుంది చేద్దామని అన్నారు. రుద్ర క్రియేషన్స్ బ్యానర్ పై గౌతమ్ వర్మ ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చారు. అలా మా కలి మూవీ మొదలైంది. అయితే ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం. జగపతి బాబు గారిని ఓ క్యారెక్టర్ కు అనుకున్నాం. అయితే మూవీ ప్రొడక్షన్ కు జగపతి బాబు గారి కాస్టింగ్ సెట్ కాలేదు. దాంతో నరేష్ అగస్త్య కు ఈ కాన్సెప్ట్ చెప్పాను. ఆయనకు బాగా నచ్చి మూవీలో నటించారు.
- కలి కథ సిద్ధమయ్యాక ఏడాదిన్నర ప్రీ ప్రొడక్షన్, కాస్టింగ్ కు టైమ్ పట్టింది. ఈ సినిమా ఒక లొకేషన్ లో జరుగుతుంది. ఫిలింసిటీలో సెట్ వేశాం. మా సినిమా పనిచేసిన కాస్ట్ అండ్ క్రూ టీమ్ అంతా యంగ్ బ్యాచ్. స్పష్టమైన ఆలోచనలతో వర్క్ చేశాం కాబట్టి ఎక్కడా ఇబ్బంది రాలేదు. హ్యాపీగా టీమ్ వర్క్ తో మూవీ కంప్లీట్ చేశాం. కె.రాఘవేంద్ర రెడ్డి గారు సమర్పకులుగా వ్యవహరిస్తూ మాకు మంచి సపోర్ట్ ఇచ్చారు.
- జీవితంలో ఎదురయ్యే సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు అనే అంశాన్ని మా మూవీలో చెబుతున్నాం. ఓ సర్వే ప్రకారం ప్రపంచంలో 70శాతం మంది ఏదో ఒక సందర్భంలో ఆత్మహత్య ఆలోచన చేస్తున్నారు. కలి చిత్రంలో ప్రిన్స్ చేసిన శివరామ్ క్యారెక్టర్ చాలా మంచి వ్యక్తి. అతని మంచితనం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాడు. మెత్తగా ఉండేవాడిని సొసైటీ ఆడుకుంటుంది. అలా అతి మంచితనంతో ఉన్న శివరామ్ సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. ఆ సమయంలో అతని ఇంటికి ఓ అపరిచిత వ్యక్తి వస్తాడు. ఈ క్యారెక్టర్ నరేష్ అగస్త్య చేశాడు. అతను వచ్చాక శివరామ్ లైఫ్ లో జరిగిన ఘటనలు ఏంటి అనేది ఈ చిత్ర కథాంశం.
- ఇద్దరు పాత్రల మధ్య కథ సాగినా స్క్రిప్ట్, డైలాగ్స్ చాలా గ్రిప్పింగ్ గా ఉంటాయి కాబట్టి సినిమా అంతా ఆసక్తికరంగా సాగుతుంది. ప్రిన్స్, నరేష్ అగస్త్య ఇద్దరూ తమ పాత్రల్లో సూపర్బ్ గా పర్ ఫార్మ్ చేశారు. హీరోయిన్ గా నేహా కృష్ణన్ నటించింది. కలి మూవీలో మంచి ప్రేమ కథ కూడా ఉంటుంది. ప్రియదర్శి బల్లి పాత్రకు డబ్బింగ్ చెప్పారు. అలాగే మహేశ్ విట్టా, అయ్యప్ప పి శర్మ ఇద్దరూ వాయిస్ ఓవర్స్ ఇచ్చారు.
- కలి సినిమాలో వీఎఫ్ఎక్స్ కు మంచి ప్రాధాన్యత ఉంటుంది. క్వాలిటీగా వీఎఫ్ఎక్స్ చేశాం. కలికి ఓ నివాసం ఉంటుంది. వీఎఫ్ఎక్స్ లో ఆ నివాసాన్ని గ్రాండ్ గా విజువలైజ్ చేశాం. మీకు ట్రైలర్ చివరలో ఆ విజువల్స్ కనిపిస్తాయి. సెన్సార్ నుంచి క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చారు. కలి సినిమాకు కల్కి మూవీకి సంబంధం లేదు. మేము ముందు నుంచీ కలి అనే టైటిల్ నే పెట్టుకున్నాం. కల్కికి ఫస్ట్ ప్రాజెక్ట్ కె అనే టైటిల్ ఉండేది.
- మన పురాణాల్లోని కలి పురుషుడి పాత్రను స్ఫూర్తిగా తీసుకుని కలి మూవీ చేశాను. సమయాన్ని, ఆత్మను ఆధారం చేసుకుని ఈ యుగాన్ని ప్రభావితం చేసే కలిని మా కథలో ఎలా చూపించాం అనేది అక్టోబర్ 4న థియేటర్స్ లో చూడండి.
ఇంకా చదవండి: ‘మా’ సభ్యులందరికీ ఫ్రీ హెల్త్ చెకప్ క్యాంప్.. మీడియాతో విష్ణు మంచు
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !