"జోకర్ యాక్టర్" సినిమా స్పెషల్ మీడియా ప్రివ్యూ.
1 month ago | 5 Views
మయూర టాకీస్ బ్యానర్ పై ప్రశాంత్ మయూర హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'జోకర్ యాక్టర్'. ఈ చిత్రంలో యుక్తా పర్వి, షైలేంద్ర కుమార్, భానుప్రకాష్, మధుసూదన్, శశికుమార్ యాదవ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సరికొత్త ప్రయత్నంగా తెరకెక్కిన జోకర్ యాక్టర్ సినిమా ప్రివ్యూ ఏర్పాటు చేశారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో ప్రశాంత్ మయూర మాట్లాడుతూ - ఈ రోజు మా జోకర్ సినిమా ప్రివ్యూకు వచ్చిన మీడియా మిత్రులకు, గెస్టులకు థ్యాంక్స్ చెబుతున్నా.
గతంలో నేను కొన్ని షార్ట్ ఫిలింస్ చేశాను. ఇప్పుడు జోకర్ యాక్టర్ సినిమాతో మీ ముందుకు రాబోతున్నాను. సరికొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించాను. ఇందులో కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారి స్ఫూర్తితో నేను చెప్పిన డైలాగ్ హైలైట్ అవుతుంది. నా దగ్గర మంచి మంచి స్క్రిప్ట్స్ ఉన్నాయి. అయితే ప్రొడక్షన్ కంపెనీస్ ను, ప్రొడ్యూసర్స్ ను అప్రోచ్ కావడం కష్టంగా ఉంది. జోకర్ సినిమాతో నాకు మంచి గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాను అన్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాసుల రామకృష్ణ మాట్లాడుతూ - జోకర్ సినిమా బాగుంది. ప్రశాంత్ మయూర గారికి కంగ్రాట్స్. మంచి ప్రయత్నం చేశారు. టెక్నికల్ గా మూవీ చాలా బాగుంది. ప్రశాంత్ గారికి ఇంకా మరిన్ని మంచి అవకాశాలు రావాలి, ఆయన హీరోగా దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా అన్నారు.
ప్రముఖ రచయిత, కం హీరో రాజేంద్ర మాట్లాడుతూ - జోకర్ యాక్టర్ సినిమా కంటెంట్ చూస్తుంటే ఎంతో క్వాలిటీగా చేశారనిపిస్తోంది. లిమిటెడ్ బడ్జెట్ లో మంచి క్వాలిటీ ఫిల్మ్ చేశారు. ప్రశాంత్ గారితో పాటు మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా అన్నారు.
శ్రీదేవి ఫిలిం డిస్ట్రిబ్యూటర్ రామారావు మాట్లాడుతూ - జోకర్ యాక్టర్ సినిమాలో ప్రశాంత్ మయూర నటన చాలా బాగుంది. ఆయన పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలతో ఈ సినిమా ఉంది. తప్పకుండా మీ అందరినీ ఆకట్టుకుంటుంది అన్నారు.
నటీనటులు - ప్రశాంత్ మయూర, యుక్తా పర్వి, షైలేంద్ర కుమార్, భానుప్రకాష్, మధుసూదన్, శశికుమార్ యాదవ్, తదితరులు
టెక్నికల్ టీమ్
డీవోపీ - పాండియన్ కుప్పన్
మ్యూజిక్ - రిషాన్ ఆదిత్య
ఎడిటర్ - ఉజ్వల్ చంద్ర
బ్యానర్ - మయూర టాకీస్
పీఆర్ఓ - వీరబాబు
రచన దర్శకత్వం - ప్రశాంత్ మయూర
ఇంకా చదవండి: స్టార్ హీరో నిఖిల్ చేతుల మీదుగా లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ "అనంతం" టీజర్ రిలీజ్
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# జోకర్ యాక్టర్ # ప్రశాంత్ మయూర # యుక్తాపర్వి