నవంబర్ 22న విడుదలకు సిద్దమైన "ఝాన్సీ ఐపీఎస్".
1 month ago | 5 Views
ఆర్ కె ఫిలిమ్స్ పతాకంపై డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్మాతగా, తెలుగులో మెగాస్టార్ లాంటి లెజండ్ సరసన నటించిన బ్యూటీ క్వీన్ లక్మీ రాయ్ ప్రధాన పాత్రలో గురుప్రసాద్ దర్శకత్వంలో తమిళలో విడుదలై ఘన విజయాన్ని సాధించిన "ఝాన్సీ ఐపీఎస్" చిత్రం నవంబర్ 22న విడుదలకు సిద్దమైంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. తమిళ్ లో సూపర్ హిట్ అయిన "ఝాన్సీ ఐపిఎస్" చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. లక్మీ రాయ్ త్రిపాత్రాభినయం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఫైట్ మాస్టర్ థ్రిల్లర్ మంజు కంపోజ్ చేసిన 8 ఫైట్స్ లక్మీ రాయ్ కెరీర్లో మైలు రాయిగా నిలిచిపోతాయి. ఈ చిత్రానికి కూడా ఫైట్స్ హైలెట్ గా నిలుస్తాయి. మా ఆర్ కె బ్యానర్ కు మంచి పేరు తెచ్చే చిత్రం "ఝాన్సీ ఐపిఏస్. లక్మీ రాయ్ చేసిన మూడు క్యారెక్టర్స్ డిఫరెంట్ షేడ్స్ లో ఉంటాయి. విద్యార్థులను మాదక ద్రవ్యాలకు అలవాటు చేసి, యువత భవిష్యత్ ను పెడదారి పట్టించే, డ్రగ్స్ ముఠా ఆటకట్టించే ఐపిఎస్ ఆఫీసర్ గా, గ్రామాల్లో రౌడీల అగడాలకు అడ్డుకట్టవేసే ఉగ్రనారిగా, కుర్రకారును ఉర్రూతలూగించే గ్లామర్ పాత్రల్లో లక్మీ రాయ్ తన నట విశ్వ రూపాన్ని ప్రదర్శించింది.
విజయశాంతి గారు నటించిన కర్తవ్యం, ఇలాంటి సినిమాలకు ఇన్స్పిరేషన్. కర్తవ్యం చిత్రంతో విజయశాంతి గారు లేడీ సూపర్ స్టార్ గా ఎదిగారు. కర్తవ్యం చిత్రం ఎలాంటి విజయాన్ని సాధించిందో, ఈ "ఝాన్సీ ఐపీఎస్" చిత్రం కూడా ఘన విజయాన్ని సాధిస్తుంది. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 22న అత్యధిక థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.
ప్రముఖ డాన్సర్, నటి ఆక్సఖాన్ మాట్లాడుతూ.. గతంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు ఎన్నో వచ్చాయి. కానీ లక్మీ రాయ్ నటించిన "ఝాన్సీ ఐపీఏస్" చిత్రానికి ప్రత్యేకత ఉంది. మూడు పాత్రల్లో అద్భుతంగా నటించారు లక్మీ రాయ్. ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు.
నటుడు జె.వి.ఆర్ మాట్లాడుతూ..ఆర్కే ఫిలిమ్స్ బ్యానర్ కు "ఝాన్సీ ఐపిఎస్" చిత్రం మంచి పేరు, డబ్బు తీసుకువచ్చే చిత్రం అవుతుంది. మంచి పబ్లిసిటీ తో, అత్యధిక థియేటర్లలో నవంబర్ 22న రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.
ఇంకా చదవండి: స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా "ధూం ధాం" సినిమా ట్రైలర్ లాంఛ్