'దేవర'తో తెలుగులోకి జాన్వీ ఎంట్రీ!

'దేవర'తో తెలుగులోకి జాన్వీ ఎంట్రీ!

4 months ago | 50 Views

జూనియర్‌ ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ జంటగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ’దేవర’ సినిమాతో బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అతిలోక సుందరి శ్రీదేవి గారాల పట్టి జాన్వీ కపూర్‌ ఈ మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి, సౌత్‌ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది. 2018లో దడక్‌ అనే హిందీ చిత్రంతో సినిమాల్లోకి ఆరంగేట్రం చేసిన ఈ చిన్నది ఓ పది చిత్రాల వరకు నటించింది కానీ రావాల్సినంత గుర్తింపు దక్కించుకోలేక. ఒక్క హిట్‌ కొట్టలేక పోయింది. తన అందాలతో బాలీవుడ్‌లో నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చిన ఈ సుందరి ఛాన్సులు దక్కించుకోవడంలో కాస్త వెనుకబడిరది.

అయితే తాజాగా ఈ అమ్మడు తెలుగు సినిమాల వైపు దృష్టి పెట్టడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చల్లోకి వచ్చింది. ఈ క్రమంలో ఎన్టీఆర్‌తో నటిస్తున్న సినిమా కాకుండా రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేస్తూ హాట్‌ టాపిక్‌గా మారింది. తాజాగా దేవర సినిమా నుంచి ఎన్టీఆర్‌, జాన్వీలపై చిత్రీకరించిన చుట్టమల్లే పాటను రెండు వారాల క్రితం విడుదల చేయగా సోషల్‌ విూడియాలో సునావిూ సృష్టిస్తోంది. అంతేకాదు యూ ట్యూబ్‌లో ఈ పాట ఇప్పటికే 7 కోట్లకు పైగా వ్యూస్‌ దక్కించుకుని సరికొత్త రికార్డులను తిరగరాస్తూ ఓ సరికొత్త చరిత్రను లిఖిస్తోంది.

ఇంకా చదవండి: 'కన్నప్ప' నుంచి మరి కొన్ని పాత్రల విడుదల!

# Devara     # JrNtr     # SaifAliKhan     # PrakashRaj     # JanhviKapoor     # OTT    

trending

View More