జాన్వీ స్పోర్ట్స్ డ్రామా ..నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల
4 months ago | 53 Views
రాజ్‌కుమార్ రావ్, జాన్వీ కపూర్ జంటగా శరణ్ శర్మ తెరకెక్కించిన స్పోర్ట్స్ డ్రామా 'మిస్టర్ అండ్ మిసెస్ మహి’ క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు రాగా అందులో జాన్వీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రం కోసం జాన్వీ ఎంతో కష్టపడినట్లు పలు ఇంటర్వ్యూల్లో వెల్లడిరచారు. ఇప్పుడీ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు నెట్‌ప్లిక్స్ వేదికగా జులై 26 నుంచి ప్రసారం కానుంది. కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రంలో రాజ్‌కుమార్ రావ్, రాజేశ్ శర్మ, కుముంద్ మిశ్రా తదితరులు కీలకపాత్రల్లో కనిపించారు. మహేంద్ర (రాజ్ కుమార్ రావ్) ఓ ఫెయిల్యూర్ క్రికెటర్. మరో ఏడాది అవకాశమిస్తే తానేంటో నిరూపించుకుంటానని బతిమాలతాడు.
అయినా తండ్రి వినిపించుకోకుండా తన స్పోర్ట్స్ షాప్ నిర్వహణ బాధ్యతల్ని అప్పగిస్తాడు. మహిమ అగర్వాల్ (జాన్వీ కపూర్)తో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. తన ఫెయిల్యూర్ స్టోరీ చెప్పినప్పటికీ మహేంద్ర మనసు నచ్చి పెళ్లి చేసుకోవడానికి అంగీకారం తెలుపుతుంది మహిమ. వైద్యురాలైన ఆమెకీ క్రికెట్ అంటే పిచ్చి. అలా ఆ ఇద్దరి క్రికెట్ ప్రేమ వాళ్లని ఎక్కడి వరకు తీసుకెళ్లిందనేది కథాంశం.
ఇంకా చదవండి: ఖోఖో నేపథ్యంలో మళయాల సినిమా
# Mr&MrsMahi # JanhviKapoor # RajkummarRao