జాన్వీకపూర్‌  'ఉలాజ్‌’ ట్రైలర్‌ విడుదల

జాన్వీకపూర్‌ 'ఉలాజ్‌’ ట్రైలర్‌ విడుదల

5 months ago | 62 Views

జాన్వీకపూర్‌ లీడ్‌ రోల్‌లో నటించిన హిందీ చిత్రం ’ఉలాజ్‌’. నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ డైరెక్టర్‌ సుధాన్షు సారియా దర్శకత్వం వహించాడు.  గుల్షన్‌ దేవయ్య, రోషన్‌ మాథ్యూ, రాజేష్‌ థాయ్‌లాంగ్‌, విూయంగ్‌ చంగ్‌, సచిన్‌ ఖేడ్‌కర్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ  మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. హార్వర్డ్‌ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్‌ అయిన సుహానా భాటియా... లండన్‌ రాయబార కార్యాలయంలో యంగెస్ట్‌ డిప్యూటీ హై కమిషనర్‌గా సెలక్ట్‌ అయినట్టు ట్రైలర్‌ ప్రారంభంలోనే చూపించారు. 


తన  ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌,  ఇంటి పేరు వల్లే చిన్న వయసులో ఆమెకు అంత పెద్ద పదవి దక్కిందంటూ కొలీగ్స్‌ తనపై నెపోటిజం కామెంట్స్‌ చేస్తారు. మరోవైపు ఓ అండర్‌ కవర్‌ ఏజెంట్‌ నుంచి ఆమెకు ఓ చాలెంజ్‌ ఎదురవుతుంది. రాయబార కార్యాలయం నుంచి రహస్య సమాచారం లీక్‌ అవడం, అదే సమయంలో 24 గంటలు ఆమె  కనిపించకపోవడంతో ఆమెపై అనుమానాలు వ్యక్తం అవుతాయి. ఆ పద్మవ్యూహం నుంచి తప్పించుకుని, తన నిజాయితీని ఆమె ఎలా నిరూపించుకుంది అనేది మెయిన్‌ కాన్సెప్ట్‌. రాజేంద్రగుప్తా, జితేంద్ర జోషి, వినీత్‌ జైన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది.

ఇంకా చదవండి: అమెరికాలో యాక్సిడెంట్‌కు గురయ్యా... అందుకే చిత్రాలను తీసుకుని రాలేకపోయా: నవీన్‌ పోలిశెట్టి

# Janhvi Kapoor     # Ulaaz     # Trailer     # August2