'జనక అయితే గనక' విడుదల వాయిదా!
3 months ago | 37 Views
దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న సినిమా 'జనక అయితే గనక’ విడుదల వాయిదా పడింది. శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో, ప్రసన్నవదనం వంటి వరుస హిట్ చిత్రాల తర్వాత సుహాస్ హీరోగా నటించగా సంకీర్తన కథానాయికగా చేసింది. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. ఇటీవల విడుదల చేసిన సినిమా ట్రైలర్ మంచి ఆదరణను కూడా దక్కించుకుంది. అయితే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. ఈక్రమంలో సెప్టెంబర్ 7న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు విడుదల తేదీని కూడా ప్రకటించి ప్రమోషన్ కార్యక్రమాలు సైతం ప్రారంభించారు. ఇదిలావుండగా ఏపీ, తెంగాణ రాష్టాల్ల్రో తుఫాన్ వల్ల వరద భీభత్సం జరగడం, చాలామంది చనిపోవడం, ఇండ్లు మునగడం, తదితర సమస్యలు తలెత్తాయి.
ఇంకా చదవండి: అక్టోబర్ 4న విడుదల కాబోతున్న యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'రోటి కపడా రొమాన్స్'
# Janakaaitheganaka # Suhas # Sankeerthanavipin