
ఆసక్తిరేపుతున్న ఓదెలా2
1 month ago | 5 Views
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ఓదెల 2. సంపత్ నంది ప్రొడక్షన్ హౌజ్ నుంచి వస్తోన్న ఈ చిత్రానికి అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. ఓం నమ: శివాయ.. అంటూ తమన్నా శివశక్తి లుక్ ఇప్పటికే నెట్టింట పోస్టర్లు వైరల్ అవుతున్నాయని తెలిసిందే. ఈ చిత్రంలో తమన్నా మహదేవ్‌కు పరమభక్తురాలిగా, ఓదెల సద్గుణ రక్షకురాలిగా కనిపించనుంది.
చాలా రోజుల తర్వాత ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్‌ను షేర్ చేశారు మేకర్స్. ఈ సినిమా ఖాతాలో అరుదైన ఫీట్ చేరనుంది. ఓదెల 2 టీజర్‌ను ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభ్ మేళాలో ఫిబ్రవరి 22న లాంచ్ చేయనున్నారు. ప్రఖ్యాత పుణ్యక్షేత్రంలో టీజర్ లాంచ్ చేసుకోబోతున్న తొలి ఇండియన్ సినిమాగా చరిత్రలో నిలిచిపోనుంది. ఈ లాంచ్ ఈవెంట్‌కు చిత్రయూనిట్, మేకర్స్ హాజరుకానున్నారు. మొత్తానికి దేశమంతా మహాకుంభ్ మేళావైపు చూస్తున్న నేపథ్యంలో అక్కడే టీజర్ లాంచ్ సినిమాపై అందరి అటెన్షన్‌ను తమవైపునకు తిప్పుకుంటోంది. ఈ చిత్రంలో వశిష్ఠ ఎన్ సింహా, హరిప్రియ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రాన్ని సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్, మధు క్రియేషన్స్‌పై తెరకెక్కిస్తున్నారు. కాంతార ఫేం అజనీష్ లోక్‌నాథ్ ఈ మూవీకి మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తుండటంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఓదెల 2 కోసం తమన్నా శివశక్తి రూపంలోకి ఎలా మారిందని తెలియజేస్తూ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.
ఇంకా చదవండి: దాదాపు పూర్తయిన వార్`2 షూటింగ్.. ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు..
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!