'ఇండియన్‌-2' విడుదల కోసం ఆసక్తి!

'ఇండియన్‌-2' విడుదల కోసం ఆసక్తి!

2 days ago | 12 Views

ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీతో పాటు గ్లోబల్‌ ఆడియెన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'ఇండియన్‌-2' కమల్‌హాసన్‌-శంకర్‌ కాంబోలో భారతీయుడుకు సీక్వెల్‌గా వస్తోంది. జులై 12న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా మారిపోయింది కమల్‌ హాసన్‌ టీం. ఇటీవలే రిలీజ్‌ చేసిన ట్రైలర్‌ సినిమాపై సూపర్‌ బజ్‌ క్రియేట్‌ చేస్తోంది. రిలీజ్‌కు ముందే మరో క్రేజీ వార్త నెట్టింట సందడి చేస్తోంది. ఇండియన్‌ 2 ఐమ్యాక్స్‌ వెర్షన్‌లో కూడా సందడి చేయనుంది. తాజా సమాచారం ప్రకారం సింగపూర్‌లో ఈ వెర్షన్‌ అందుబాటులో ఉండనుంది. కమల్‌ హాసన్‌ అభిమానులకు ఇక విజువల్‌ ట్రీట్‌ పక్కా అని ఈ వార్త చెప్పకనే చెబుతోంది.

కమల్‌ హాసన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్‌లో ఫాలోయింగ్‌ ఉందో ఈ అప్‌డేట్‌ మరోసారి చెప్పకనే చెబుతోంది. మరి ఇండియాలో కూడా ఐమాక్స్‌ వెర్షన్‌ రిలీజ్‌ చేస్తారా.. అనేది తెలియాల్సి ఉంది. మేకర్స్‌ ఇప్పటికే ఇండియన్‌ 2 నుంచి లాంఛ్‌ చేసిన గ్లింప్స్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. పాన్‌ ఇండియా కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో ఎస్‌జే సూర్య, బాబీ సింహా, సిద్దార్థ్‌, సముద్రఖని, లెజెండరీ కమెడియన్‌ బ్రహ్మానందం, మధుబాల, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా భవానీ శంకర్‌, కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్‌  రెడ్‌ జియాంట్‌ మూవీస్‌పై ఉదయనిధి స్టాలిన్‌`సుభాస్కరన్‌ తెరకెక్కిస్తున్నారు.

ఇంకా చదవండి: వెట్రిమారన్‌ సినిమాలో రుహానీ శర్మ!

# Indian2     # Bharateeyudu2     # KamalHaasan     # TeluguCinema