అవినీతి సబ్జెక్టుగా  భారతీయుడు-2'.. మూడో పార్ట్‌ కూడా ఉంటుందన్న శంకర్‌!?

అవినీతి సబ్జెక్టుగా భారతీయుడు-2'.. మూడో పార్ట్‌ కూడా ఉంటుందన్న శంకర్‌!?

3 days ago | 11 Views

కమల్‌ హాసన్‌ హీరోగా దర్శకుడు శంకర్‌ రూపొందించిన చిత్రం 'భారతీయుడు’. 1996లో వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా తాజాగా 'భారతీయుడు 2’ ను తెరకెక్కించారు. జులై 12న ఇది ప్రేక్షకుల ముందుకురానుంది. ఈనేపథ్యంలో మూవీ టీమ్‌ విూడియాతో ముచ్చటించి పలు విషయాలు పంచుకుంది.

కమల్‌ హాసన్‌  మాట్లాడుతూ.. 'అవినీతి విషయంలో అందరి మైండ్‌ సెట్‌ మారాలి. 'భారతీయుడు’ మొదటి పార్ట్‌ వచ్చినప్పటికీ, ఇప్పటికీ ఈ విషయంలో ఏం మార్పు రాలేదు. ఈ సినిమా అంతా అవినీతి నేపథ్యంలోనే తెరకెక్కించారు. ఇది చూశాక చాలామంది ఆలోచిస్తారు. నేను గతంలో నటించిన కొన్ని చిత్రాల్లోని పాత్రలతో పోలిక ఉండడంతో 'భారతీయుడు’లో భాగం కావాలని అనుకోలేదు. అందుకే శంకర్‌ తనంతట తానుగా నన్ను తప్పించాలని కావాలనే నా రెమ్యునరేషన్‌ పెంచాను. కానీ, నిర్మాతలు నా డిమాండ్లు అంగీకరించడంతో ఆ చిత్రంలో నటించాను. శంకర్‌కు తన కథపై నమ్మకం ఎక్కువ. నాతోనే తీయాలని పట్టుబట్టి ’భారతీయుడు’ తీశాడు. అతని పట్టుదల చూసి నేను ఆశ్యర్చపోయాను’ అని చెప్పారు. తనను ఎన్నో ఏళ్లుగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. భారతీయుడు కథను మూడు పార్ట్‌లుగా ఎందుకు తీయాల్సివచ్చిందో శంకర్‌ వివరించారు. ‘భారతీయుడు’ మొదటి భాగం ఒక స్టేట్‌లో జరిగే కథ. 3.20 గంటల నిడివి.

ఆ చిత్రం బ్లాక్‌బస్టర్‌ అయింది. ఇప్పుడు ’భారతీయుడు 2’ దేశంలోని అన్ని రాష్టాల్రకు సంబంధించిన కథ. సినిమా ప్రారంభించినప్పుడు ఒక్క పార్ట్‌లోనే మొత్తం చూపించాలని భావించాం. కానీ, చిత్రీకరణ మొదలుపెట్టాక అన్ని సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయి. ఒక్క పార్ట్‌లోనే దీన్ని చూపించాలంటే కొన్ని సన్నివేశాలు కట్‌ చేయాలి. లేదంటే నిడివి తగ్గించాలి. అలా చేస్తే వాటిలో ఉన్న పవర్‌ పోతుంది. అన్ని సీన్స్‌ బాగా వచ్చాయి. ఎక్కడా బోర్‌ కొట్టడం లేదనిపించింది. అందుకే దీన్ని మరో పార్ట్‌ (భారతీయుడు 3) చేయాలని నిర్ణయించుకున్నాం‘ అని  తెలిపారు.

ఇంకా చదవండి: 'కల్కి' ప్రీ బుకింగ్స్‌లో రికార్డు.. సలార్‌ను మించి కలెక్షన్లు!

# Bharateeyudu 2     # Kamal Haasan     # Rajinikanth     # Rakul Preet Singh     # Aamir Khan    

related

View More
View More